Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు గురించి ఆలోచిస్తున్న భాగీని కరుణ తిడుతుంది. పేరు తెలియదు. ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ అక్కా అని పిలిచావా? అంటూ కోప్పడుతుంది.
కరుణ: ఒసే భాగీ ఎవ్వరికీ కనిపించని నీకు మాత్రమే కనిపించే ఆ అక్క ఎవరు? ఎందుకే ఆమె ఈ ఇంటి చుట్టే తిరుగుతుంది.
అంటూ కరుణ డౌట్ క్రియేట్ చేయగానే ఆరు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది భాగీ.
కరుణ: ఇప్పుడు ఎందుకే అట్ల బిగుసుకుపోయినవ్..
భాగీ: అది ఆ పక్కింటావిడే.. ఆరు అక్కనేమో అని డౌట్..
కరుణ: ఏందో ఏం మాట్లాడుతున్నావే నువ్వు.. చనిపోయిన ఆమె ఈ బతికున్న ఆమె ఎట్లైతదే..
భాగీ: తెలియదే.. కానీ ఒక్కసారి ఆలోచించు. ఆవిడ ఈవిడ ఒక్కరే అయితే మన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతది కదా?
కరుణ: అవును పోరి నువ్వు చెప్తుంటే నాకు కూడా గట్లనే అనిపిస్తుంది.
భాగీ: కానీ ఈ విషయం ఎలా కన్‌ఫం చేసుకోవాలి. అది కన్‌ఫం అని తెలుసుకునేంత వరకు ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ తెలియకూడదే..పొద్దనే చూశావు కదే అంజు ఎలా ఏడిసిందో..
కరుణ: సరే నువ్వు ఒక పని చేయ్ నువ్వు ఏదో ఒకటి చేసి ఆ ఆరు అక్క ఫోటో చూడు. అప్పుడు ఇద్దరు ఒక్కటేనా కాదో తెలుస్తుంది.
అని చెప్పి కరుణ వెళ్లిపోతుంది. భాగీ మాత్రం ఆరు మాటలు గుర్తు చేసుకుంటుంది. ఎలాగైనా ఇవాళ ఆరు అక్క ఫోటో చూడాల్సిందే అనుకుంటుంది. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. మనోహరి ఎదురుగా కూర్చుని చూస్తుంటుంది. సీసాలో ఉన్న ఆరు ఏడుస్తుంది.
మనోహరి: అబ్బా దీని బాధ చూస్తుంటే జాలిగా ఉంది ఘోర నాకు త్వరగా ఆత్మను నీ ఆధీనంలోకి తెచ్చుకో..
ఘోర: నేను అనుకున్న పని చేయడానికి ఒక పూజ దూరంలో ఉన్నాను.. కొన్ని గంటల దూరంలో ఉన్నాను మనోహరి. ఆ ఆత్మ కథ ముగిసిపోతుంది.
ఆరు: మీ ఇద్దరికి నేను ఏం అన్యాయం చేశానని ఇలా వేధిస్తున్నారు నన్ను. మను నా ప్రాణాలను తీసేశావు. నేను కలలు కన్న జీవితం కూడా నాకు కాకుండా చేశావు. అయినా ఇంకా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మను.
మనోహరి: నువ్వు ఏం అంటున్నావో వినిపించదు. కనిపించదు. కానీ కచ్చితంగా నువ్వు నిస్సహాయంగా ఏడుస్తుంటావు అని తెలుసు.
పూజ అయ్యాక నేనే నీకు ఫోన్ చేస్తాను నువ్వు ఇంటికి వెళ్లు అని ఘోర చెప్తాడు. పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను అని మనోహరి అంటే అది గంటల త్వరబడి చేసేది. ఏకాగ్రతతో చేసేది నువ్వు వెళ్లి పడుకో అని చెప్పగానే మనోహరి వెళ్లిపోతుంది. హాల్లో నిర్మల, శివరాం మాట్లాడుకుంటుంటే.. భాగీ వచ్చి ఆరు అక్క ఫోటో ఇస్తారా? అని అడుగుతుంది. వెనకే వచ్చిన మనోహరి షాక్ అవుతుంది. నువ్వు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఫోటో చూడలేదా? అని అడగ్గానే చూశాను కానీ మళ్లీ చూద్దామని అడుగుతుంది భాగీ.
శివరాం: ఈ విషయం అమర్ తో చెప్పొద్దు. ఇందాకే పిల్లుల వచ్చి ఆరు ఫోటో అడిగితే ఇచ్చాం. ఇవాళంతా వాళ్ల దగ్గరే పెట్టుకుంటారట.
నిర్మల: ఈ విషయం అమర్ కు తెలియనివ్వకు అమ్మా.. మళ్లీ ఆరు ఫోటో చూసి పిల్లలు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంటారని ఆరు ఫోటోను ఇవ్వనివ్వడు.
శివరాం: మనసులో ఉన్న వాళ్ల అమ్మని కంటికి కనిపించనంత మాత్రాన మర్చిపోతారా? చెప్పు.
అంటూ ఎమోషనల్ అవుతారు. మరోవైపు పిల్లలు ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తుంటారు.
అంజు: అందరూ అమ్మా దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది అన్నారు. కానీ మమ్మల్ని వదిలేసి నువ్వు దేవుడి దగ్గరకు వెళ్లవని నాకు తెలుసమ్మా.. నీ ఆశీర్వాదం తీసుకున్నానమ్మా.. నా బాధ చూసి నాకోసం నువ్వు వచ్చావు కదా..?
అమ్ము: అమ్మ కళ్లముందు లేకపోతే మనతో లేనట్టేనా..? అమ్మ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది.
ఆకాశ్: అవును అంజు నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకే బాధగా ఉంది. అమ్మకెలా ఉంటుంది చెప్పు.
ఆనంద్: మనం ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉంటేనా కదా? అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది.
అని మాట్లాడుకుంటుంటారు. కింద భాగీ నేను వెళ్లి పిల్లల దగ్గర చూస్తాను అని చెప్పి పైకి వెళ్తుంది. డోర్ దగ్గర నుంచి అంతా గమనిస్తున్న ఏదో ఒకటి చేసి భాగీ ఫోటో చూడకుండా చేయాలనుకుని లోపలికి వెళ్తుంది. వెనకాలే మనోహరి వెళ్తుంది. అమర్‌కు చెప్పడం బెటర్ అనుకుని రూంలోకి వెళ్తుంది మనోహరి. భాగీ పైకి రూంలోకి వెళ్లగానే పిల్లలు ముగ్గురు పడుకుని ఉంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణిని వాయించిన స్వప్న – కొత్త ప్లాన్ వేసిన అపర్ణ