బాలీవుడ్ లో నటిగా, ఐటెమ్ గర్ల్ గా దుమ్మురేపుతోంది అందాల తార ఊర్వశి రౌతేలా. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఐటెమ్ సాంగ్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది. తాజాగా తెలుగులోనూ తన ఒంపుసొంపులతో సినీ లవర్స్ ను ఆకట్టుకుంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ సాంగ్ తో దుమ్మురేపింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో స్పెషల్ సాంగ్ చేసింది. అటు రామ్-బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
రూ.190 కోట్లతో ముంబైలో ఇల్లు కొనుగోలు చేసిన ఊర్వశి
తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ముంబైలో ఆమె ఒక ఇంటిని కోనుగోలు చేసిందట. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యష్ చోప్రా ఇంటి పక్కనే ఆమె ఈ బంగళాను కొనుగోలు చేసిందట. ఈ ఇంటి కోసం ఆమె ఏకంగా రూ. 190 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు అంతస్తుల ఈ బంగ్లాలో విలాసవంతమైన తోట, వ్యక్తిగత వ్యాయామశాల ఉన్నాయట. ఈ ఇల్లు ఆధునిక సౌందర్యంతో పాటు అద్భుతమైన ఇంటీరియర్ ను ఏర్పాటు చేశారట. తన అభిరుచులకు అనుగుణంగా ఈ ఇంటిని నిర్మించుకుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊర్వశి బంగాళ ఫోటోలు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి.
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ
ఇక ఊర్వశి రౌతేలా గత ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అడుగు పెట్టింది. గత నెలలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె రెండవసారి కనిపించింది. తన మెడకు మొసలి లాంటి నెక్లెస్ ధరించి నెట్టింట్లో ట్రోలింగ్ కు గురయ్యింది. ఇందేం నెక్లెస్ అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఊర్వశి 15 సంవత్సరాల వయస్సులో విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో సత్తా చాటింది. 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హనీ సింగ్ మ్యూజిక్ వీడియో ‘లవ్ డోస్’తో సూపర్ పాపులారిటీ సంపాదించింది. యాక్టింగ్ కంటే కూడా లావిష్ లైఫ్ స్టయిల్‌తో హెడ్‌లైన్స్ లో నిలుస్తూ వస్తోంది.
తాజాగా ఊర్వశి తన 29వ పుట్టిన రోజును ప్యారిస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీ కోసం సుమారు రూ. కోటి ఖర్చుచేసిందట. ఈ వేడుకలో వజ్రాలు పొదిగిన గులాబీలు, 24 క్యారెట్ల గోల్డ్ కప్ కేక్‌లు, డైమండ్ కేక్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయట. ఊర్వశి రౌతేలా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ 4’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే రణదీప్ హుడాతో కలిసి ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. రీసెంట్ గా 10 ఏళ్ల దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బాలీవుడ్ నటిగా ఊర్వశి రౌతేలా ఘనత సాధించింది.
Read Also: మహాకాళి ఆలయానికి వెళ్తా, అజ్మీర్ దర్గానూ సందర్శిస్తా - ట్రోలర్స్‌కు సారా స్ట్రాంగ్ కౌంటర్