హాలీవుడ్ మూవీస్‌లో ఇకపై ఇండియన్ స్టార్స్ కూడా మెరవనున్నారు. ఇదేమీ కొత్త కాకపోయినా.. గతంతో పోల్చితే ఈ సారి అవకాశాలు బాగా పెరిగాయనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొన్ వంటి స్టార్లు హాలీవుడ్ మూవీస్‌లో మెరిశారు. ‘ఆర్ఆర్ఆర్’ పాపులారిటీతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు కూడా బాగా క్రేజ్ పెరిగింది. ముందుగా రామ్ చరణ్‌కు ఓ హాలీవుడ్ మూవీలో అవకాశం వచ్చింది. త్వరలో ఎన్టీఆర్‌కు కూడా పిలుపు రానున్నట్లు సమాచారం. తాజాగా వీరి జాబితాలో సమంత, రణవీర్ సింగ్ కూడా చేరారు.


భారత్‌పై హాలవుడ్ ఏజెన్సీల చూపు


చాలా మంది బాలీవుడ్ నటులు, దర్శకులు హాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్ నుంచి టాలెంటెడ్ నటీనటులను, దర్శకులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రముఖ టాలెంట్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులు హాలీవుడ్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారు.  తాజాగా ఈ లిస్టులో రణ్‌వీర్ సింగ్ కూడా చేరారు. తాజాగా ఆయన విలియం మోరిస్ ఎండీవర్ (WME) అనే అంతర్జాతీయ టాలెంట్ ఏజెన్సీతో జత కట్టారు. ఈ మేరకు అగ్రిమెంట్ మీద సంతకాలు చేశారు. గాల్ గాడోట్, ఎమ్మా స్టోన్, ఓప్రా, చార్లిజ్ థెరాన్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ ఇదే ఏజెన్సీలో పని చేస్తున్నారు. తాజాగా ఈ బృందంలో రణవీర్ కూడా చేరిపోయారు.


హాలీవుడ్ ఏజెన్సీలతో సైన్ అప్ చేసిన భారతీయ నటీనటులు వీరే


రణవీర్ సింగ్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లను పొందడానికి అంతర్జాతీయ టాలెంట్ ఏజెన్సీ విలియం మోరిస్ ఎండీవర్ (WME)తో సైన్ అప్ చేశాడు. 2010లో యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ‘బ్యాండ్ బాజా బారాత్‌’తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి నటించారు. ప్రస్తుతం కరణ్ జోహార్ ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో ఆలియా భట్‌తో కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. అతని చివరి చిత్రం ‘సర్కస్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.






అలియా భట్


బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ కూడా హాలీవుడ్ వైపు చూస్తోంది. 2021లో ఈ నటి విలియం మోరిస్ ఎండీవర్‌తో  సైన్ అప్ చేసింది. అలియా త్వరలో ‘గాల్ గాడోట్ హార్ట్ ఆఫ్ స్టోన్‌’తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది.  






ఫ్రీదా పింటో


WMEతో  స్లమ్‌డాగ్ మిలియనీర్ నటి ఫ్రీడా పింటో కూడా సైన్ చేసింది.  ఆమె ‘మిస్టర్ మాల్కమ్ లిస్ట్’, ‘రాయల్ డిటెక్టివ్’, ‘ఎ క్రిస్మస్ నంబర్ వన్’, ‘ఇంట్రూషన్’, ‘నీడిల్ ఇన్ ఎ టైమ్‌స్టాక్’, ‘హిల్‌బిల్లీ ఎలిజీ’, ‘లవ్ వెడ్డింగ్ రిపీట్’, ‘ఓన్లీ’, ‘ది పాత్, యమసాంగ్: మార్చ్ ఆఫ్ ది హాలోస్’ సహా పలు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో కనిపించింది.


సంజయ్ లీలా బన్సాలీ


దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కూడా హాలీవుడ్ అవకాశాలపై కన్నేశాడు. ఈ చిత్రనిర్మాతతో పాటు అతడి బ్యానర్, భన్సాలీ ప్రొడక్షన్స్, హాలీవుడ్ ఏజెన్సీ WMEతో సైన్ అప్ చేసారు. ఆయన తన చిత్రం, అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ కోసం అంతర్జాతీయ ప్రచారాన్ని నిర్వహించడానికి WME ప్రయత్నించింది. మొత్తంగా పలువురు బాలీవుడ్ స్టార్స్ అంతర్జాతీయ అవకాశాల కోసం అంతర్జాతీయ సంస్థలతో జోడీ కడుతున్నారు. బాలీవుడ్ లో సత్తా చాటిన నటీనటులు ఇక హాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.



చెర్రీ, సామ్‌లూ అదే బాట


టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, సమంతా కూడా ఇప్పటికే హాలీవుడ్ మీద బాగా ఫోకస్ చేశారు. ‘RRR’ సినిమాతో రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేసేందుకు హాలీవుడ్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన హాలీవుడ్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  సమంతా కూడా ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ లాంటి వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలో తను కూడా అంతర్జాతీయ సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.


Read Also: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్