Ugram : అల్లరి నరేష్ చివరిగా యాక్షన్ థ్రిల్లర్ 'ఉగ్రం'లో కనిపించాడు. ఈ చిత్రానికి  విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మర్నా మీనన్ కథానాయికగా నటించగా... అల్లరి నరేష్ నాన్‌సెన్స్ పోలీస్‌ ఆఫీసర్ గా నటించాడు. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ (OTT)లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఉగ్రం డిజిటల్ పార్ట్ నర్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ను షేర్ చేసింది. జూన్ 2వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. కాగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు కీలక పాత్రలు పోషించారు.


నాంది కాంబినేషన్ లో వచ్చిన 'ఉగ్రం' సినిమా ఇటీవలే విడుదలైంది. ప్రేక్షకులు కూడా ఆదరించి, అల్లరి నరేష్ నటనను మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ సీఐ శివకుమార్ పాత్రలో కనిపించాడు. వరంగల్ లో వరుస మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఇదిలా ఉండగా నెల రోజులు కూడా పూర్తి కాకముందే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైన ఈ చిత్రంపై అల్లరి నరేష్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.


‘ఉగ్రం’ కథేంటంటే..


శివ కుమార్ (అల్లరి నరేష్) ఓ ఎస్ఐ. సిన్సియర్ గా పనిచేస్తుంటాడు. తప్పిపోయిన తన భార్య కూతురి, కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు శివ భార్య, కూతురు ఎలా మిస్ అయ్యారు? దాంతో పాటు సిటీలో తప్పిపోయిన వందలాది మంది ప్రజలు ఏమయ్యారు? ఈ క్రైమ్ వెనక ఎవరెవరున్నారు? మిస్సింగ్ కేసుల సంగతేంటి.. చివరకు భార్యకూతుర్ని కనిపెట్టాడా లేదా అనేదే స్టోరీ కథాంశం.


ఎప్పుడూ కామెడీ సినిమాలతో, స్టోరీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్... ఈ మధ్య సీరియస్ స్టోరీలు చేస్తూ కూడా హిట్ కొడుతున్నారు. గతంలో 'నాంది', కొన్ని రోజుల క్రితం విడుదలైన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' వంటి యాక్షన్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేష్. 'నాంది' సూపర్ హిట్ అయినా.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఉగ్రంతో తన ఉగ్రరూపం చూపించాడు. కానీ ఈసారి కూడా ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. భారీ అంచనాల మధ్య రిలీజైనా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది.


ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఉగ్రం.. స్టోరీ బాగానే ఉన్నా జనాలకు మాత్రం అంతగా రీచ్ కాలేకపోయింది. ఇక థియేటర్లలో చూసినా ఇంట్లో తీరిగ్గా చూడాలనుకునే వారికి, థియేటర్లలో చూడలేకపోయిన, చూడని వారికి మేకర్స్ ఓటీటీ ద్వారా అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో ఈ సినిమాను చూసేయొచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.


Read Also : అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం