వేద యష్ కారు తీసుకుని మెకానిక్ షెడ్ కి వస్తుంది. అక్కడే సులోచనని యాక్సిడెంట్ చేసిన కారుని చూపిస్తాడు. ఎవరిది ఈ కార్ అని అడుగుతుంది. ఈ కారు ఎవరు తీసుకొచ్చారు మనిషి ఎలా ఉంటాడు అని వేద మెకానిక్ ని అడుగుతుంది. మెకానిక్ గుర్తులేదని చెప్పేసరికి వేదనే కారు నెంబరు ఆధారంగా అది అభిమన్యుదే అని తెలుసుకుంటుంది. వెంటనే యష్ కి ఫోన్ చేసి యాక్సిడెంట్ చేసిన కారు ఆచూకీ దొరికిందని చెప్తుంది. యష్ వెంటనే వేద దగ్గరకి వెళ్తాడు. ఇప్పుడే అభిమన్యు దగ్గరకి వెళ్ళి వాడి మీద కేసు బుక్ చేయించి లోపల వేయిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు నేను హ్యాండిల్ చేస్తాను అని యష్ కోపంగా అభి ఇంటికి వెళ్తాడు.


మాళవిక దగ్గరకి యష్ కోపంగా వచ్చి సాక్ష్యాలతో వచ్చాను అని అరుస్తాడు. ఆ మాటకి మాళవిక టెన్షన్ పడుతుంది. నీ మోహమే చెప్తుంది మీరే అత్తయ్యగారికి యాక్సిడెంట్ చేసింది మీరే అని తెలిసింది, మిమ్మల్ని వదిలిపెట్టను అని అంటాడు. సాక్ష్యం చెప్పింది మా అత్తయ్య గుద్దింది నల్ల కారే అని రిపేర్ చేసిన మెకానిక్ చెప్పాడు యాక్సిడెంట్ చేసిన కారు అదే అని.. పక్కా రుజువులతో నిరూపిస్తాను ఇదంతా అభిమన్యు చేశాడని ఈ విషయం నీకు కూడా తెలుసు. పోటీ నాకు ఆ అభిమాన్యుకి మధ్యలో ఆ పెద్దావిడ ఏం చేసింది, నా మీద కోపం వేద మీద చూపిస్తారా, నువ్వు అసలు మనిషివేనా అని తిడతాడు. మా అత్తయ్యకి యాక్సిడెంట్ కి కారణం అయిన ఖైలాష్ ని చేయించిన అభిమన్యు గాడిని వదిలిపెట్టనని పోలీసులకి ఫోన్ చేస్తుంటే మాళవిక వద్దని ఆపుతుంది.


Also Read: జాబ్ మానేసిన నందు, సామ్రాట్ ముందు అడ్డంగా బుక్కైన లాస్య- చేతులెత్తేసిన అనసూయ


నీకు సగం మాత్రమే తెలుసు జరిగింది వేరు అని మాళవిక యష్ ని బతిమలాడుతుంది. అటు వేద యాక్సిడెంట్ చేసింది అభిమన్యు, ఖైలాష్ అని ఇంట్లో చెప్తుంది. యాక్సిడెంట్ కి వాళ్ళకి ఏం సంబంధం లేదని తనే యాక్సిడెంట్ చేశానని మాళవిక ఒప్పుకుంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావ్ నేను నమ్మను నీ లవర్ ని కాపాడటానికి ఇలా చేస్తున్నావ్ కదా అని యష్ అంటాడు. కానీ మాళవిక మాత్రం నేనే చేశాను అభి వాళ్ళు నన్ను కాపాడటానికి ట్రై చేస్తున్నారని చెప్తుంది. దయచేసి నువ్వు పోలీసులకి ఫోన్ చెయ్యకు సొసైటీలో నా పరువు పోతుంది, నాకు అవమానంగా ఉంటుంది నన్ను కాపాడు అని యష్ ని అడుగుతుంది. ఈ మాటలు అన్నీ ఆదిత్య వింటాడు. కంగారుగా వచ్చి ఏమైందని అడుగుతాడు.


యష్ దగ్గరకి వెళ్ళి ఆది బతిమలాడతాడు. మా మామ్ ని ఎక్కడికి తీసుకెళ్ళకండి నేను మీరు చెప్పినట్టే వింటాను నా కోసం మా మామ్ ని వదిలెయ్యండి, కావాలంటే పనిష్మెంట్ నాకు ఇవ్వండి ప్లీజ్ నేను మా మామ్ లేకుండా ఉండలేను అని ఏడుస్తాడు. నా కోసం కాకపోయినా ఆది కోసం అయినా ఒప్పుకో అని మాళవిక బతిమలాడుతుంది. ఇటు వేద మాత్రం చాలా నమ్మకంగా వాళ్ళని అరెస్ట్ చేయిస్తాడని ఎదురు చూస్తుంది. ఇది కావాలని చేసింది కాదు ఇది పొరపాటు వల్ల జరిగిందని చెప్తుంది. ఈ తుఫాను నేనే ఆపాలి కనీసం నా ఆది కోసం అయిన ఏదో ఒకటి చేసి తీరాలి అని యష్ అనుకుంటాడు. ఆది యష్ చెయ్యి పట్టుకుని మీరు ఎప్పుడు నన్ను ఒకటి పిలవమని చెప్తారు కదా మా అమ్మకి ఏం కాకుండా చూసుకుంటే నేను అలా పిలుస్తాను అని నాన్న ప్లీజ్ నాన్న అని అడుగుతాడు.


Also Read: మేడమ్ తన ప్రాధాన్యత అనేసిన వసు, ఇంప్రెస్ అయిపోయిన ఇగో మాస్టర్- జగతి తరపున క్షమాపణ అడిగిన రిషి


నేను ఎవరికి చెప్పానులే ఏడవకు, నీకోసం నేను ఏమైనా చేస్తాను అని అంటాడు. మాళవిక యష్ కి థాంక్స్ చెప్తుంది. మాళవిక ఏడుస్తూ వచ్చి యష్ భుజం మీద వాలుతుంది. ఆది మన కొడుకు నేను నీకు వాడిని దూరం కానివ్వను అని మాళవికకి మాట ఇస్తాడు.