దివ్య పొద్దు పొద్దున్నే లేచి హడావుడి చేస్తుంది. అంకిత పొద్దున్నే నిద్ర లేచిందని దివ్య ఆటపట్టిస్తుంది. ఈరోజు నుంచి నీ కొడుకు, కోడళ్లకి ఒక రూల్ పెట్టు నైట్ గదిలోకి వెళ్లేటప్పుడు మొబైల్స్ నీ దగ్గర పెట్టేయమని చెప్పు అని ఐడియా ఇస్తుంది. ఆ మాటకి అంకిత దివ్య చెవి మెలిపెట్టేసరికి పారిపోతుంది. ప్రేమ్, శ్రుతి ఎవరికి కనిపించకుండా వెళ్లాలనుకుంటే పరంధామయ్యకి చిక్కుతారు. అనసూయ స్వీట్స్ తీసుకొచ్చి పిల్లలు పుట్టే దాకా గది దాటకూడదని పరంధామయ్య ఆపుతాడు. కానీ ప్రేమ్ మాత్రం జారుకుంటాడు.


లాస్య అనసూయకి ఫోన్ చేస్తుంది. సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకుంటున్నాడు అని కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తుంది. మీ అబ్బాయి జాబ్ వదిలేశాడని చెప్తుంది. వీడికి ఈ వదిలెయ్యడం పిచ్చి ఏంటి ఈ అలవాటు మానదా, పెళ్ళాన్ని కాదని ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు మళ్ళీ ఈ ఉద్యోగం ఎందుకు వదిలేశాడని తిడుతుంది. మీ కోడలు కానీ కోడలికి ఆయన ఆఫీసులో ఉండటం  ఇష్టం లేదనుకుంటా సామ్రాట్ ని రెచ్చగొట్టి అవమానించేలా చేసింది. పండగ రోజు సామ్రాట్, తులసిని నిలదీశారు కదా అది మనసులో పెట్టుకుని మా మీద పగ సాధిస్తున్నాడు. నన్ను జాబ్ మానేయమంటున్నాడు. పస్తులతో ఉంటే కాళ్ళ బేరానికి వస్తామని తులసి అనుకుంటుందని లాస్య బాగా ఎక్కిస్తుంది. ఇంత జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని అనసూయ అరుస్తుంది. తులసి ఎందుకు ఇలా తయారై అందరినీ ఇలా ఏడిపిస్తుందని అనసూయ మనసులో అనుకుంటుంది.


Also Read: మేడమ్ తన ప్రాధాన్యత అనేసిన వసు, ఇంప్రెస్ అయిపోయిన ఇగో మాస్టర్- జగతి తరపున క్షమాపణ అడిగిన రిషి


అప్పుడే తులసి అనసూయ దగ్గరకి వచ్చి బయటకి వెళ్తున్నా అని చెప్తుంది. నాకు ఎందుకు చెప్పడం అని నిష్టూరం ఆడుతుంది. అభి వచ్చి ఏమైందని అనసూయని అడుగుతాడు. ఈ ఇంటి బరువు బాధ్యతలు మోసేది మీ అమ్మే. నమ్ముకున్న దిక్సూచిని తప్పుదారి పడితే ఎలా. ఆఫీసులో మీ అమ్మ మీ నాన్న అవమానపడేలా చేసిందంట, మీ నాన్న ఉద్యోగం మానేశారు అని అనసూయ చెప్తుంది. ఆ మాటకి అభి అంతెత్తున ఎగిరిపడతాడు. తులసికి చెప్పగలిగేది ఒక్క మీ తాతయ్య ఆయనతో మాట్లాడుకో అని చెప్తుంది. సామ్రాట్ పరంధామయ్యకి ఫోన్ చేస్తాడు. ఎవరు లేని చోటకి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు.


నాకు చెప్పిన పని నేను పూర్తి చేశాను అని సామ్రాట్ చెప్తాడు. మీరు చేసిన ఒక మంచి పనిలో నాకు భాగస్వామ్యం కల్పించారు చాలా సంతోషంగా ఉందని అంటాడు. మీ లాంటి మంచి మావయ్య దొరకడం తులసి అదృష్టం అని సామ్రాట్ అంటే కాదు దురదృష్టం నా కొడుకు వల్ల తులసి పడరాని పాట్లు పడుతుంది. తులసి కోసం ఏం చేయలేకపోతున్నా అని బాధపడ్డాను మీ వల్ల అది నాకు దూరం అయ్యిందని పరంధామయ్య అంటాడు. సామ్రాట్ తులసిని చూసి మురిసిపోవడం చూసి వాళ్ళ బాబాయ్ కాసేపు ఆడుకుంటాడు. లాస్య నేరుగా సామ్రాట్ దగ్గరకి వస్తుంది. ఈసారి నుంచి నా క్యాబిన్ లోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టు లేదంటే సెక్రటరీని అడిగి అపాయింట్ మెంట్ తీసుకో అని గాలి తీస్తాడు. నందు ఎక్కడ అని అడుగుతాడు. జాబ్ మానేశాడు అని లాస్య చెప్పడంతో సామ్రాట్ షాక్ అవుతాడు. నందులాంటి వాళ్ళని చూస్తే మనుషుల మీద నమ్మకం పోతుందని అంటాడు. నందు పనులు నేను చూసుకుంటాను, ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని అడుగుతుంది.


Also Read: దుర్గ కాళ్ళ మీద పడి బతిమలాడుకున్న మోనిత, చుక్కలు చూపించిన దీప- శౌర్య కోసం వెతుకుతున్న కార్తీక్