యష్ మాళవిక మాటలు విన్న వేద చాలా బాధపడుతుంది. దీని గురించి యష్ ని నిలదీస్తుంది. నేను అన్నది వేరు నువ్వు విన్నది వేరు నేను ఒకలా అంతే నీకు మరోలా అనిపించిందని యష్ సర్ది చెప్పేందుకు చూస్తాడు.  భర్త కోరుకున్న సంతోషాన్ని ఇవ్వలేనిది భార్య ఎలా అవుతుంది. అమ్మ అయ్యే రాత దేవుడు నా నుదుటి మీద రాయలేదు. మీకు ఆ విషయం తెలుసు. నేను లైఫ్ లో చాలా ఎక్కువ సార్లు విన్న తిట్లు ఏంటో తెలుసా గొడ్రాలు. అవమానాలకి అలవాటు పడిపోయాను అని వేద కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మీకు ఆదికి మధ్యలోకి ఎప్పటికీ రానని వేద అంటుంది. ఆది స్థానం వాడిదే నీ స్థానం నీదే.. ఇక మాళవిక అంటావా తను కేవలం ఆదికి తల్లి మాత్రమే అనేసరికి నేను కూడా కేవలం ఖుషికి తల్లిని మాత్రమే అని వేద బాధగా చెప్తుంది.


Also read: రాధపై అధికారం చెలాయిస్తే సహించనని మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన రామూర్తి- కాడెద్దులుగా మారిన ఆదిత్య, రుక్మిణి


ఇప్పటికీ మీకు మాళవిక మీద ప్రేమ ఉంది కదా అని వేద యష్ ని అడిగేస్తుంది. దీని గురించే ఆలోచిస్తూ యష్ వేదని కూడా ఒక మాట అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. సులోచనకి త్వరగా తగ్గాలని శర్మ దేవుడు ముందు కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంటికి ధూపం వేస్తూ మాలిని ఇంట్లోకి వస్తుంది. ధూపం కావాలని సులోచన దగ్గరకి తీసుకొచ్చి ఊడుతుంది. ఆ పొగకి తట్టుకోలేక సులోచన గట్టిగా అసలు నీకు బుద్ధి ఉందా ఇది ధూపం అనుకునున్నావా లేదంటే దోమల మందు అనుకుంటున్నావా, సాంబ్రాణి ఎలా వెయ్యాలో తెలియకుండా బయల్దేరింది గయ్యాళి గంప, పిప్పళ్ళ బస్తా అని సులోచన తిడుతుంది. ఆ మాటలు విని అందరూ సంతోషిస్తారు. అప్పుడే వచ్చిన వేద కూడా తల్లి మాట్లాడటం చూసి ఆనందపడుతుంది.


ఈ మలబార్ మాలిని మాట్లాడించిందని అంటుంది. నేను మళ్ళీ బతుకుతాను మామూలు మనిషి అవుతాను అనుకోలేదు. నేను లేకపోతే నువ్వు ఏమైపోతావో అని బెంగగా అనిపించిందని సులోచన బాధపడుతుంది. అవన్నీ వదిలేయ్ సులోచన నువ్వు మా అందరికీ కావాలి అని మాలిని అంటుంది. సులోచనని మామూలు మనిషి చేసేందుకు మా అందరి కంటే నువ్వే ఎక్కువ శ్రమ పడ్డావ్ అని శర్మ మాలినిని అంటాడు. యాక్సిడెంట్ చేసింది నల్ల కారు అని చెప్తుంది. అది డ్రైవ్ చేసింది ఎవరో చెప్పగలవా అని వేద అడిగితే లేదమ్మా కారు లైట్లు నా కళ్ళలో పడ్డాయి అని చెప్తుంది. మీకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టను అని యష్ సులోచనకి మాట ఇస్తాడు.


Also Read: తులసి నీకు బాస్ నందుకి వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్- ప్రేమ్ చెంప చెళ్లుమనిపించిన తులసి


వేద తన కారు చెడిపోవడంతో యష్ కారుని ఇవ్వమని వచ్చి అడుగుతుంది. కానీ ఇవ్వను అనేసరికి ఖుషి పిలిచి కారు తాళాలు తీసుకుంటుంది. వేద యష్ కారు తీసుకుని స్టార్ట్ చేసి రివర్స్ అవుతూ వెనుక ఉన్న కార్ ని ఢీ కొట్టేస్తుంది. ఆ కారు తీసుకుని మెకానిక్ షెడ్ కి వెళ్తుంది. ఖైలాష్ కారు రిపేర్ ఇచ్చిన దగ్గరకే వేద కూడా వస్తుంది. కారు మీద ఉన్న గీతలు అసలు కనిపించకుండా చెయ్యాలి అని చెప్తుంది. పెద్ద పెద్ద యాక్సిడెంట్ చేసిన కార్లే నా దగ్గరకి వస్తాయి వాటిని బాగు చేస్తాను అని ఖైలాష్ కారు చూపిస్తాడు.


తరువాయి భాగంలో..


అమ్మా వేద నీ జాతకం చూశాను నీకు పెద్ద ప్రమాదం రాబోతోందని సులోచన చెప్తుంది. అటు మాళవిక ఏడుస్తూ ఆ యాక్సిడెంట్ చేసింది నేను అని యష్ కి చెప్తుంది. నా కోసం మా మామ్  ని వదిలెయ్యండి అని ఆదిత్య ఏడుస్తూ అడుగుతాడు. మాళవిక ఏడుస్తూ వచ్చి యష్ ని హగ్ చేసుకుని నువ్వే నన్ను కాపాడాలి యష్ అని అడుగుతుంది.