సంగీత్ ఫంక్షన్ కోసం అటు మాలిని, ఇటు సులోచన వాళ్ళు తెగ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సంగీత్ లో ఆడపెళ్ళి వాళ్ళు గెలవాలని శశిధర్ అంటే ఏంటి గెలిచేది ఇలా చేస్తే అందరూ నవ్వుతారని శర్మ ఏడిపిస్తాడు. చిత్ర వచ్చి డల్ గా ఉంటుంది. డాన్స్ వేయమంటే మూడ్ లేదని చెప్తుంది. అదేంటి పెళ్లి కూతురివి నువ్వే డల్ గా ఉంటే ఎలా అంటాడు. వసంత్, చిత్రకి కలిపి డాన్స్ లేదని డల్ ఉందేమో అనుకుంటాడు. మరోవైపు వసంత్ మాలిని వాళ్ళకి డాన్స్ నేర్పిస్తూ ఉంటాడు. ఖుషి అటూ ఇటూ తిరుగుతూ అమ్మమ్మ, నానమ్మని ఎంకరేజ్ చేస్తుంది. ముద్దపప్పు వాళ్ళ మీద మనమే గెలవాలని అంటుంటే వేద వచ్చి అంత తక్కువ అంచనా వేయొద్దని అంటుంది. ఇక సులోచన, మాలిని పోట్లాట మొదలు పెట్టేస్తారు. నువ్వు డాన్స్ చేస్తే పత్రం కొండ మీద నుంచి దొర్లినట్టు ఉంటుందని ఒకరిని మరొకరు తిట్టుకుంటారు. వాళ్ళ మధ్యలోకి వసంత్ వెళ్తే పక్కకి తోసేస్తారు.


Also Read: రాజ్యలక్ష్మిని వణికించేసిన దివ్య- నందుని ఇరికించేందుకు పక్కా స్కెచ్ సెట్ చేసిన లాస్య


ఈ వయసులో మీకు డాన్స్ అవసరమా అని వేద అంటుంది. మాకు వయసు అయిపోయిందని అంటారా సులోచన వాళ్ళు మళ్ళీ మేమే గెలుస్తామని పోట్లాడుకుంటారు. గొడవ ఆపేందుకు వసంత్ సెల్ఫీ అనేసరికి అంతా ఫ్రీజ్ అయిపోతారు. చిత్ర టెన్షన్ గా ఉండటం చూసి వేద ఏమైందని అడుగుతుంది. అదేమీ లేదని బాగానే ఉన్నానని కవర్ చేస్తుంది. అభి వేధిస్తున్న విషయం అక్కతో చెప్తే చాలా పెద్ద గొడవ అవుతుందని చిత్ర మనసులో అనుకుంటుంది. పెళ్లి ఎన్నో రోజులు లేదు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నట్టు బయటకి చెప్తుంది. ఏం టెన్షన్ లేదు మాళవిక అభిమన్యు వాళ్ళతో వెళ్లిపోతుంది, నువ్వు వసంత్ నాతోనే ఉంటారు. ఏవేవో ఊహించుకుని టెన్షన్ పడొద్దని ధైర్యం చెప్తుంది. ఈ సంగీత్ ఇవన్నీ అవసరమా చిన్న విషయానికి కూడా మాళవిక గొడవ చేస్తుందని అంటుంది. సరే సంగీత్ క్యాన్సిల్ కూల్ గా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది.


Also Read: ఉత్కంఠ నడుమ పూర్తయిన రిషిధార నిశ్చితార్థం- అంతుచిక్కని శైలేంద్ర ప్లాన్


వేద రాగానే యష్ సరసాలు మొదలు పెట్టేస్తాడు. సంగీత్ క్యాన్సిల్ అయ్యిందని వేద చెప్పేసరికి అయ్యో అలాగా నేను చాలా ప్రాక్టీస్ చేశానే అని వేదని పట్టుకుని లాగేసుకుంటాడు. మా ఆవిడ అందాన్ని చూసి మతి పోయిందని మాటలతో పడగొట్టేస్తాడు. వేద బయటకి వెళ్తుంటే ఆపి నీ పిచ్చి పట్టిందని అంటాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. రెండు కుటుంబాలు ఒక దగ్గర కూర్చుని ఉంటే వేద వాళ్ళు వస్తారు. సంగీత్ క్యాన్సిల్ అనేసరికి సులోచన, మాలిని వామ్మో ఎందుకని ఆశ్చర్యంగా అడుగుతారు. డాన్స్ వేసి అందరూ అలిసిపోతే పెళ్ళిలో నీరసంగా కనిపిస్తారని అందుకే సంగీత్ క్యాన్సిల్ చేసినట్టు వేద చెప్తుంది. ఇక పెళ్లికి యష్ కొడుకు ఆదిత్య వస్తాడు. ఖుషి తన అన్నయ్యకి ప్రేమగా అన్నం తినిపిస్తుంది.