సులోచనకి యాక్సిడెంట్ అవ్వడంతో హాస్పిటల్ కి తీసుకొస్తారు. 24 గంటల్లోపు ఆమె స్పృహలోకి రావాలి అప్పుడు కానీ ఏమి చెప్పలేమని డాక్టర్ చెప్తుంది. సడన్ షాక్ వల్ల బ్రెయిన్సఫర్ అయ్యింది, లక్కీగా పెరాలసిస్ లక్షణాలు ఏమి రాలేదు. కానీ ఆమె స్పృహలోకి రావడం చాలా ముఖ్యం. ఈలోగా బ్రెయిన్ రెస్పాండ్ అవాలని చెప్తుంది. ఓ వేళ రెస్పాండ్ అవకపోతే పేషెంట్ కోమాలోకి వెళ్తుందని డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
ఖుషి దేవుడు ముందు నిలబడి పూజ చేస్తుంది. నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం, నాకు మంచి మంచి శ్లోకాలు నేర్పిస్తుంది. మా అమ్మమ్మ బెస్ట్. ఇప్పుడు తనకి ఒంట్లో బాగోలేదు హాస్పిటల్ లో ఉంది. తనకి తగ్గించు, మా అమ్మమ్మని త్వరగా ఇంటికి పంపించేయ్ ప్లీజ్ నాకు ఏడుపు వస్తుంది నాకోసం ఈ ఒక్కటి చేసిపెట్టు అని ఖుషి దేవుడిని అడుగుతుంది. పోలీసులు హాస్పిటల్ కి వస్తారు. డాక్టర్ తో మాట్లాడి సులోచన పరిస్థితి తెలుసుకుంటారు. ఈ యాక్సిడెంట్లో పెద్దావిడ తప్పులేదు ఎవరో ఒక వ్యక్తి కారు స్పీడ్ గా వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూద్దామంటే అక్కడ సీసీటీవీ పని చేయడం లేదు. ఇది తాగి రాష్ గా చేసిన డ్రైవింగ్ కాదు, ఎవరో కావాలని చేసిన యాక్సిడెంట్.. అని పోలీసులు చెప్తారు. ఏది ఏమైనా యాక్సిడెంట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని యష్ సీరియస్ గా పోలీసులకి చెప్తాడు.
Also Read: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్
అమ్మకి ఈ పరిస్థితి కలిపించిన వాడిని పట్టుకోవాలి, వాడికి శిక్ష పడాల్సిందే అని వేద అంటుంది. మరోవైపు ఖైలాష్ కారు గ్యారేజీకి వెళ్తాడు. యాక్సిడెంట్ చేసిన వాడిని వదిలిపెట్టనని యష్ వేదకి మాట ఇస్తాడు. కారు పరిస్థితి చూశావ్ కదా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు కారు మాత్రం బాగు కావాలని అంటాడు. వేద సులోచన దగ్గరకి వచ్చి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో అందరూ వచ్చి తనని స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆమెలో ఎటువంటి కదలిక ఉండదు. తన పరిస్థితి ఏంటి అని వేద్ అడుగుతుంది.. ఇలాంటి కేసుల్లో కోమాలోకి వెళ్తే రికవర్ అవడం చాలా కష్టమని డాక్టర్ చెప్తుంది. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది తను ఇక స్పృహలోకి రావాలి అలా జరగాలి అంటే ఏదైనా మిరాకిల్ జరగాలని డాక్టర్ అంటుంది.
మాలిని బయటకి వెళ్తూ వెనక్కి వచ్చి.. ఏయ్ సులోచన చక్కగా పడుకున్నావ్ ఏంటే నేను వచ్చినాక కూడా నా గొంతు విని కూడా లేవవా ఎంత పొగరే నీకు.. మలబార్ మాలిని ఇక్కడ రెస్పెక్ట్ లేదా నువ్వు ఇట్లా పడుకుని పోతే మనం ఎలా పోట్లాడుకోవాలి, నాకు టైమ్ పాస్ అవుతుంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా నీతో గొడవ పెట్టుకుందామని చూస్తున్నా. కళ్ళు తెరవలేదనుకో నీ కూతురుతోనే నీ కిచెన్ లో చికెన్ వండించి తినిపిస్తా.. నన్ను గయ్యాళి గంప అంటావ్ కదా నువ్వు అవును నేను గయ్యాళి అత్తని. నీ కూతుర్ని రాచి రాంపాన పెడుతున్నా చూడు లేచి మాట్లాడు పోట్లాడు, ఈరోజు నువ్వో నేనో తెలిపోవాలి. ఇదిగో సులోచన నువ్వే గొప్ప.. నాకు భరతనాట్యం రాదు అన్నావ్ కదా ఇప్పుడే ఇక్కడే చేస్తాను అని మాలిని ఏడుస్తూ డాన్స్ చేస్తూ తనని స్పృహలోకి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నిస్తుంది. చూడు నీకోసం డాన్స్ చేస్తున్నా అంటుంటే సులోచన చెయ్యి కదిలిస్తుంది.
Also Read: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి