నందుకి తులసి కంగ్రాట్స్ చెప్తుంది. మీకు ముందే చెప్దామని అనుకున్నా కానీ కుదరలేదని సామ్రాట్ అంటాడు. అన్నీ అర్హతలు ఉన్న నందగోపాల్ గారికి మేనేజర్ పోస్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తులసి చెప్తుంది. నువ్వు నిజంగానే ఈ మాట చెప్తున్నవా తులసి అని లాస్య కౌంటర్ వేస్తే మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకొకటి మాట్లాడటం నాకు రాదని అంటుంది. తులసి తరఫున నాది ఒక రిక్వెస్ట్ సర్.. తన అర్హతకి తగిన ఉద్యోగం ఏదైనా ఇవ్వమని లాస్య సామ్రాట్ ని అడుగుతుంది. నాకు జాబ్ చేయాలనే ఆలోచన అసలు లేదు నన్ను ఇలా స్వేచ్చగా వదిలెయ్యండి అని తులసి దణ్ణం పెట్టేసి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. సోరి తులసిగారు మీకు నమ్మకద్రోహం చేశాను అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు.
సామ్రాట్ అలా చేసినందుకు అనసూయ, అభి సంతోషంగా ఉంటారు కానీ మిగతా వాళ్ళు మాత్రం మొహాలు మాడ్చుకుంటారు. మామ్ జాబ్ పోయినందుకు నేను బాధపడటం లేదు కానీ ఇలా తేసేయడం నాకు నచ్చలేదని అభి అంటాడు. ఎవరి బలవంతం వల్లో ఇలా జరిగి ఉంటుందని పరంధామయ్య అనుమానిస్తాడు. ఆయన నోరు విప్పి చెప్తేనే కానీ విషయం తెలియదని ప్రేమ అంటాడు. తులసి చేసిన తప్పేంటని పెద్దాయన సామ్రాట్ ని నిలదీస్తాడు. నీ తొందరపాటు వాళ్ళ అందరి దృష్టిలో చేతకానిది అనే ముద్ర పడిందని అంటాడు. చేతకానిది అనే ముద్ర పడితే చెరుపుకోవచ్చు, కానీ నీటి లేనిదని ముద్రపడితే చేరుపుకోవడం ఎంత కష్టమో తెలుసా బాబాయ్.. అక్కడితో జీవితం ముగిసిపోతుందని సామ్రాట్ అంటాడు.
Also Read: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి
తులసి నీతిలేదని ఎవర్రా ఆ మాట అన్నది అని పెద్దాయన కోపంగా అరుస్తాడు. నరం లేని నాలుక ఎన్ని మాటలు అయినా అంటారు, అందుకని నువ్వు ఇలా చేస్తావా.. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం నీకు ఏంటని అడుగుతాడు. ప్రాబ్లం నాకు కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే అని సామ్రాట్ కోపంగా చెప్తాడు. అనసూయమ్మ గారు స్వయంగా ఇంటికి వచ్చి అడిగారు, తనని ఆఫీసుకి రానివ్వకు, ప్రాజెక్ట్ తో ఏ సంబంధం లేకుండా చెయ్యమని అడిగారు. ఇన్నాళ్ళూ వెన్నెముకలాగా నిలబడ్డారు. ఈగ కూడా వాలకుండా చూసుకున్నారు, అలాంటిది ఆవిడ తులసిగారిని ఆఫీసుకి దూరంగా ఉంచామని అడిగారు అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు’ అని సామ్రాట్ ఆవేదనగా చెప్తాడు.
ఆవిడ ఏదో చెప్పిందని నువ్వు ఇలా చేస్తావా తులసి ఎంత బాధపడి ఉంటుందో తెలుసా, ఆ నిర్ణయం తీసుకునే ముందు ఎంత స్ట్రగుల్ అయ్యానో తెలుసా? ప్రేమ్ తన తల్లిని అవమానించాడని ఒకడిని చావగొట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాడు నా ముందే తులసిగారి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. రేపు ప్రేమ్ ఉన్న పరిస్థితిలో దివ్య ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బాబాయ్. నేను మౌనంగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలసి వస్తుందని’ సామ్రాట్ బాధగా చెప్తాడు. తులసిగారిని నడిసముద్రంలో వదిలేశానో లేక ఒడ్డున వేశానో అర్థం కావడం లేదు, తను నా ఫ్రెండ్ కాదు, బిజినెస్ పార్టనర్ కూడా కాదు అంతకంటే ఎక్కువ అని చాలా ఫీల్ అవుతాడు.
Also Read: మాళవిక, ఖైలాష్ ని ఉతికి ఎండగట్టిన సులోచన- కుమిలి కుమిలి ఏడ్చిన మాలిని
తులసి ఇంట్లో అందరూ మూడీగా ఉంటారు. ప్రేమ్ తులసి చెయ్యి తన తల మీద చెయ్యి పెట్టి నిజం చెప్పమని అడుగుతాడు. సామ్రాట్ గారి చేసిన పనికి బాధగా కోపంగా లేదా అని అడుగుతారు. నాకు అలా ఏమి లేదు నెత్తి మీద బండరాయి తీసేసినట్టు ఉందని తులసి అంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ తులసి నచ్చజెప్పేందుకు చూస్తుంది. సామ్రాట్ దగ్గర ఉద్యోగం పోతే ఏమైంది సంగీతం పాఠాలు చెప్పుకుంటే సరిపోతుంది కదా అని అనసూయ అంటుంది. సామ్రాట్ లాస్యకి ఫోన్ చేసి తులసి ప్రాజెక్ట్ పనులు చూసుకోమని చెప్తాడు. ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ నిర్ణయం అయినా నందుని తీసుకోమని తను జనరల్ మేనేజర్ కదా అని చెప్తాడు. తులసిని వద్దు అనుకున్నప్పుడు ఇక ప్రాజెక్ట్ పనులు ఎందుకని అడుగుతుంది. ఇది కంపెనీ ప్రాజెక్ట్ నేను చెప్పింది చెయ్యి అని సామ్రాట్ అంటాడు.