అవ్వకి నయం అయ్యేదాక ఇక్కడే ఉంటావా సారు అని దేవి అడుగుతుంది. ఉంటానులే అని ఆదిత్య చెప్తాడు. 'నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని కన్నతల్లికి అలా తప్పుడు మందులు ఇస్తున్నాడా. అలా అని నేను ఇట్లా ఇడిచిపెట్టి ఎలా పోతాను. వాడు అలా పాగల్ గాడిలెక్క చేస్తుంటే నేను పోవాలని చూస్తే ఆ తల్లిని ఏదైనా చేసినా చేస్తాడు. ఆ తల్లికి నయం అయిన తర్వాతే ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి. ముందు వాడు కథలు పడకుండా చెయ్యాలి. వాడికి సాయం చేసే వాళ్ళ సంగతి చూడాలి' అని రాధ అనుకుంటుంది. విషయం ఆదిత్యకి చెప్పడానికి వస్తుంది కానీ ఆగిపోతుంది. వాడు అన్నంత పని చేస్తున్నాడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకుండా చేసేందుకు తల్లికి తప్పుడు మందులు ఇస్తున్నాడు, రేపు ఆమెని ఏదైనా చేసి నా పెనీమిటిని దోషిని చెయ్యడని నమ్మకం ఏంటని రుక్మిణి ఆలోచిస్తుంది.
నా పెనిమిటిని ఇక్కడ నుంచి పంపించాలి, విషయం చెప్తే మాధవ్ మీద కోపంతో గొడవకి దిగుతాడు. నిజం చెప్పకుండా ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించాలని రుక్మిణి అనుకుంటుంది. దేవి, చిన్మయి ఆదిత్య దగ్గర ఆడుతుంటే వెళ్ళి పడుకోమని చెప్తుంది. మాధవ్ ఫోన్ చెయ్యడంతో సత్య ప్రకృతి వైద్యశాలకి వస్తుంది. ఆదిత్య ఇక్కడే ఉన్నాడు ప్లాన్ చేసి మరి మమ్మల్ని ఇక్కడకి తీసుకొచ్చాడు. అసలు ఆదిత్యకి నా కుటుంబం మీద ఇంత ఏంటో నాకు అర్థం కావడం లేదు. పిల్లల కోసం అనుకుని నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. కానీ ఆదిత్య ఎందుకు వస్తున్నాడో తెలిశాకా నా వల్ల కావడం లేదు నువ్వే వచ్చి చూడు అని ఆదిత్య, రుక్మిణి వాళ్ళని చూపిస్తాడు. వాళ్ళని చూసి సత్య షాక్ అవుతుంది.
Also Read: మాళవిక, ఖైలాష్ ని ఉతికి ఎండగట్టిన సులోచన- కుమిలి కుమిలి ఏడ్చిన మాలిని
రుక్మిణి: నువ్వు ఇలా అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు
ఆదిత్య: నిజం చెప్తే తను ఒప్పుకోదు రుక్మిణి
రుక్మిణి: ఒప్పుకోదని నువ్వు అబద్ధం చెప్పి వచ్చుడేంటి.. ఇక్కడ నుంచి వెళ్లిపో
ఆదిత్య: నిన్ను వదిలేసి ఎలా వెళ్లిపొమ్మంటావ్
రుక్మిణి: నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు సత్యకి తెలిస్తే మంచిగా ఉండదు
ఆదిత్య: సత్యకి ఎవరు చెప్తారు, అయినా ఏం కాదులే మిమ్మల్ని వదిలేసి నేను వెళ్లలేను అనడం సత్య విని ఛీ కొట్టి ఏడుస్తూ వెళ్ళిపోతుంది.
నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సత్య బాధపడితే నాకు మంచిగా ఉండదు, నా మీద నిజంగా ప్రేమ ఉంటే వెళ్లిపో జానకమ్మని చూసుకోడానికి నేను ఉన్నాను కదా అని రుక్మిణి చెప్తుంది. సరే అలాగే వెళ్లిపోతాను అని ఆదిత్య అంటాడు. నేను పంపించకుండా నీతోనే ఎలా పంపించానో చూశావా రాధ ఇంటికి వెళ్ళాక ఆదిత్యకి మంచి సర్ ప్రైజ్ ఉంటుందని మాధవ్ అనుకుంటాడు.
Also Read: అనసూయ మాట విని షాకింగ్ నిర్ణయం తీసుకున్న సామ్రాట్- గాల్లో తేలిపోతున్న లాస్య
రాధ మాధవ్ దగ్గర డబ్బు తీసుకున్న నర్స్ చెంప పగలగొడుతుంది. మనిషి ప్రాణం పోయాల్సిందే పోయి తప్పుడు మందులు ఇచ్చి నయం కాకుండా చేస్తావా ఇలా చేస్తే నీ ప్రాణం తీస్తా, నేను ఎవరో తెలుసా నా పెనిమిటి ఆఫీసర్. నేను ఒక మాట చెప్తే సీదా తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారని రాధ వార్నింగ్ ఇస్తుంది. ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి అని నర్స్ రాధని ప్రాదేయపడుతుంది. అప్పుడే డాక్టర్ వస్తుంది. ఏమైందని అడుగుతుంది. ఆ మాధవ్ మాటలు విని ఆ అమ్మకి ఏదైనా తప్పుడు వైద్యం చేస్తే అందరినీ జైల్లో కూర్చోబెడతా అని కోపంగా చెప్తుంది. విడిచిపెట్టా కదా అని ఆ మాధవ్ గాడికి విషయం చెప్పావా బొక్కల్లో గుజ్జు తీస్తా అని మరోసారి రాధ వార్నింగ్ ఇస్తుంది.
మాధవ్ నర్స్ కి ఎదురుపడి చెప్పినట్టే చేస్తున్నావ్ కదా అని అడుగుతాడు. అవునండి మీరు చెప్పినట్టే అన్నీ మందులు మారుస్తున్నా, మీ మాట కాదని నేనేమీ చెయ్యను అని నర్స్ చెప్తుంది. ఆదిత్య ఇంటికి వస్తాడు. క్యాంప్ ఎలా జరిగిందని ఆదిత్యని సత్య అడుగుతుంది. బాగా జరిగిందని చెప్పి వెళ్ళిపోతాడు. సత్య ఆదిత్య దగ్గరకి వెళ్ళి క్యాంప్ గురించి వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాటలకి ఆదిత్య సీరియస్ అవుతాడు. నువ్వు వెళ్ళిన క్యాంప్ గురించి నువ్వు చెప్పవు కానీ నేను చెప్తాను అని సత్య రుక్మిణి, ఆదిత్య కలిసి ఉన్న ఫోటో చూపించడంతో షాక్ అవుతాడు.