Horoscope Today 7th October 2022: ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Horoscope Today 7th October :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Continues below advertisement

Horoscope Today 7th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

Continues below advertisement

మేషరాశి
మేష రాశి వారికి ఈరోజు చాలా ఫలవంతమైన రోజు. ఒకటి కంటే ఎక్కువ మూలాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.  ఈ రోజు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. 

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు సంతోషకరమైన రోజు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొన్నాళ్లుగా మీ కుటుంబంలో కొనసాగుతున్న అసమ్మతిని ఉపయోగించుకుని మీ మధ్య గొడవ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ కారణంగా బాధపడతారు. అత్తమామల నుంచి గౌరవం పొందుతారు.

మిథున రాశి
మిథున రాశికి చెందిన వారు ఈరోజు దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అదే సమయంలో తమ రెగ్యులర్ పనులను మాత్రం అస్సలు నెగ్లెట్ చేయరాదు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంపై శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగులకు మంచి రోజు. 

Also Read: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఈ రోజు మీ కుటంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. ఇది మీకు బాధగా ఉంటుంది. ఇంటికి కొత్త వాహనం తీసుకురావాలనే మీ కోరిక ఈరోజు నెరవేరుతుంది.

సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. విదేశాలలో ఉండి వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది . కుటుంబ సభ్యుల అవసరాలను సులభంగా తీర్చగలుగుతారు. ఈ రోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు..ఆ డబ్బు మీ చేతికి తిరిగొచ్చే అవకాశాలు చాలా 
తక్కువ.

కన్యా రాశి
ఈ రోజు కన్యా రాశి వారికి ఏదైనా లావాదేవీ సమస్యగా మారవచ్చు..ఆలోచనాత్మకంగా అడుగేయండి. మూడవ వ్యక్తి రాక కారణంగా, ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య సమస్య తలెత్తవచ్చు. ఈ రోజు మీరు మీ మనస్సులో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం మీ తల్లిదండ్రులతో మాట్లాడవలసి ఉంటుంది. 

Also Read: గడ్డిపై ప్రతీకారం తీర్చుకునేవాళ్లుంటారా ... కానీ చాణక్యుడి విజయం అక్కడి నుంచే మొదలైంది..

తులారాశి
తులా రాశి విద్యార్థులు ఈరోజు మానసిక భారం నుండి విముక్తి పొందుతారు. ఉద్యగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి, కానీ మీరు సంతోషంగా ఉండటం వల్ల వాటిని సంతోషంగా నెరవేరుస్తారు. ఈ రోజు కుటుంబ సభ్యునికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు కానీ మీ కారణంగా కుటుంబ సభ్యులు బాధపడతారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు కుటుంబంలోని ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే వాటిని వారు సక్రమంగా నెరవేరుస్తారు. మీకు ఈ రోజు మీ తల్లితో విభేదాలు రావొచ్చు. కుటుంబంలో ఎవరైనా మీతో ఏదో ఒక విషయంలో కోపంగా ఉంటారు. 

ధనుస్సు రాశి
ఆర్థిక పరిస్థితి బావుండడం వల్ల మీ మనసుకి ఆనందం కలుగుతుంది. ఈ రోజు మీరు వ్యక్తులతో అనవసర చర్చలు చేయకపోవడమే మంచిది. ఉద్యోగులకు మంచి రోజు. పని విషయంలో తొందరపాటు వద్దు,నిర్లక్ష్యం వద్దు.

మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు సాధారణంగానే ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి మాటకి కట్టుబడి ఉండాలి లేదంటే కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీ మాటతీరుని మార్చుకోవాలి లేదంటే ఇబ్బందులు పెరుగుతాయి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో ఏదైనా ఆర్థిక సమస్య వస్తే దానికి సులువైన పరిష్కారం దొరుకుతుంది. మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరుగుతుంది. మీ మనస్సులో ఆలోచనలను ఎవరి ముందు ఉంచుకోవలసిన అవసరం లేదు...అలా కాకుండా అన్నీ చెప్పుకుంటే మీరే నష్టపోతారు. ఉద్యోగులకు మంచి రోజు.

మీన రాశి
ఉద్యోగం మారాలి అనుకుంటే మీనరాశివారికి ఇదే మంచిసమయం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటారు. ఈ రోజు మీరు కుటుంబంలో పెరుగుతున్న బాధ్యతల కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు కానీ సులభంగా నెరవేరుస్తాడు. మీరు ఈ రోజు స్నేహితుడి నుంచి బహుమతి పొందుతారు...

Continues below advertisement