వేద కోసం యశ కోర్టు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వేద బయటకి వస్తుంది. డ్రాప్ చేస్తాను అని యష్ అడిగితే ఆటోలో వెళ్తాను అని చెప్తుంది. ఆటోలు ఇక్కడ అంతగా దొరకవు చెప్పు క్లినిక్ కా ఇంటికా చెప్పు వదిలేస్తాను అని అంటాడు. ఆల్రెడీ వదిలేశారు కదా మళ్ళీ ఇంకేముందని వేద వెళ్ళిపోతుంది. ఖైలాష్ వచ్చి వేదని పలకరించి కారులో డ్రాప్ చేస్తాను రమ్మని అడుగుతాడు. సిగ్గులేని జన్మ అని వేద తిట్టి వెళ్లిపోతుంటే ఖైలాష్ వెంటపడతాడు. కారులో పక్క సీటులో కూర్చుని వెళ్దాం రమ్మని నీచంగా మాట్లాడతాడు. వేద తిడుతుంది కానీ అసలు పట్టించుకోకుండా యశోధర్ గురించి నోటికొచ్చినట్టు వాగుతాడు. వేదని పట్టుకోబోతుంటే యష్ వచ్చి ఖైలాష్ చేతిని పట్టుకుంటాడు.
Also Read: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్
ఎన్ని సార్లు చెప్పాలి నా భార్య చెయ్యి పట్టుకోవడానికి అని ఖైలాష్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. వేద ఆపుతున్నా కూడా యష్ ఆగకుండా వాడిని కొడుతూనే ఉంటాడు. రక్తం వచ్చేలా కొడతాడు. పూల కుండీ తీసుకుని ఖైలాష్ మీదకి విసరబోతుంటే వేద అడ్డుపడుతుంది. ‘జైల్లో ఉండాల్సిన వాడివి ఈరోజు బయట ఉన్నావంటే అది నా భార్య పెట్టిన భిక్షవల్లే. ఏమన్నావ్ నా వల్ల నా భార్యకి సంతోషం లేదని అంటావా.. అవును అయినా సరే వేద నాకోసం ఎంతో చేస్తుంది, ఎంతగానో భరిస్తుంది, నాకోసం తపనపడుతుంది. ఈరోజు వేద లేకపోతే యశోధర్ లేడు, నాకూతురు నా ఫ్యామిలీ లేదు. అలాంటిది నా వేదకి ద్రోహం చేస్తున్నా, తనని తన ఫ్యామిలీని క్షోభ పెడుతున్నా కానీ అన్ని భరిస్తుంది. తన స్థానంలో వేరే ఎవరు ఉన్నా ఎప్పుడో ఛీ కొట్టి వెళ్లిపోయారు. కానీ వేద అలా కాదు నేను ఎంత తప్పు చేసిన భరిస్తుంది, క్షమిస్తుంది. నేను తన చెయ్యి వదిలేసినా తను నా చేతిని వదలదు. నా దేవత వేద, నాకోసమే పుట్టిన నా దేవత’ అని ఎమోషనల్ గా మాట్లాడతాడు.
వేదని పట్టుకుని యష్ ఏడుస్తాడు. మాళవిక వచ్చి యష్ చేతిని పట్టుకుని పరమేశ్వర్ దగ్గరకి వెళ్దాం అన్నావ్ కదా పద అని లాక్కుని వెళ్లబోతుంది. యష్ కోపంగా గెట్ లాస్ట్.. నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, నువ్వు చేసిన పనుల వల్లే ఇలా అయిపోయింది నరకం అనుభవిస్తున్నా అని గట్టిగా అరుస్తాడు. వెంటనే వేద చెయ్యి పట్టుకుని తనని తీసుకుని వెళ్ళిపోతాడు. వేద తన చెయ్యి వదలమని అడుగుతుంది. ‘వదలను ఎప్పటికీ నీ చెయ్యి వదలను, నువ్వు నా భార్యవి నా సర్వస్వం, నా సొంతం నా హక్కు నీది నాది ఈ జన్మ బంధం కాదు ఎన్నెన్నో జన్మల బంధం’ అని యష్ తనని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ వేదని ఏమన్నావ్ యశోధర్ కి అంతా కోపం ఎందుకు వచ్చింది, పిచ్చి కుక్కని కొట్టినట్టు ఎందుకు కొట్టాడు అని మాళవిక ఖైలాష్ ని అడుగుతుంది. వేద చెయ్యి పట్టుకోబోయాను అని చెప్తాడు.
Also Read: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్
యష్ చేతికి గాయం అవుతుంది. అది చూసి వేద అల్లాడిపోతుంది. తన చేతికి వెంటనే కట్టుకట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది. తనని కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళమని యష్ అంటాడు. కానీ వేద మాత్రం వినకుండా మిమ్మల్ని వదిలేసేది లేదు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని కారు తనే డ్రైవ్ చేస్తుంది. సులోచన వేద కాపురం గురించి తలుచుకుని ఏడుస్తుంది. మాలిని ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. అప్పుడే వేద యష్ చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకుని వస్తుంది. అది చూసి సులోచన వాళ్ళు సంతోషిస్తారు. యష్ ని కూర్చోబెట్టి తన చేతికి మందు రాసి కట్టుకడుతుంది. అప్పుడే మాళవిక యష్ కి ఫోన్ చేస్తుంది.