‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘సుల్తాన్’, ‘ఒకే ఒక జీవితం’ లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తన 2వ తెలుగు ప్రాజెక్టును మొదలు పెట్టింది. విలక్షన కథాంశాలు, చక్కటి నిర్మాణ విలువలకు పెట్టింది పేరైన ఈ సంస్థ 'రెయిన్‌ బో' పేరుతో కొత్త సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. 'రెయిన్‌బో'  చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో నిర్మాణాన్ని ప్రారంభించింది. షూటింగ్ ఏప్రిల్ 7నుంచి మొదలు పెట్టనుంది.






రష్మిక మెయిన్ లీడ్ లో 'రెయిన్‌బో' చిత్రం


ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్‌ పోషించనున్నట్లు ప్రకటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై SR ప్రకాష్ బాబు, SR ప్రభు ఈ బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 'రెయిన్‌బో' అన్ని వయసుల ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుందని వెల్లడించారు. నూతన దర్శకుడు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. KM. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా, భాస్కరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది- SR ప్రభు


కొత్త సినిమా ప్రకటన సదర్భంగా నిర్మాత SR ప్రభు కీలక విషయాలు వెల్లడించారు. "'రెయిన్‌బో' చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం.  'ఒకే ఒక జీవితం' తర్వాత మా రెండవ తెలుగు ప్రొడక్షన్‌ని ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రేక్షకులు ఇప్పటి వరకు మా సినిమాలకు మంచి మద్ధతు ఇచ్చారు.  అందుకే ప్రతిభావంతులైన నటీనటులు, సిబ్బంది, చక్కటి కథాశంతో  'రెయిన్‌బో' నిర్మిస్తున్నాం. ఈ సినిమా కూడా ఆడియెన్స్ ను అలరిస్తుందని భావిస్తున్నాం” అన్నారు.   


ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంది- శాంతరూపన్


'రెయిన్‌బో' తెలుగు సినిమాలో ఒక రకమైన రొమాంటిక్ ఫాంటసీ కథగా నిలుస్తుందనిదర్శకుడు శాంతరూపన్ చెప్పారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో అత్యంత అద్భుతమైన నటనను కనబర్చుతుందని వెల్లడించారు. ఈ చిత్రంలో కథనం, సృజనాత్మకత ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుందని వెల్లడించారు.  


అమ్మాయితో ఒక క్రేజీ రైడ్‌ లా ఉంటుంది- రష్మిక


ఇక ఈ సినిమాలో మెయిన్ రోల్ చేస్తున్నందుకు హీరోయిన్ రష్మిక మందన్న సంతోషం వ్యక్తం చేసింది. ''అమ్మాయిల కోణంలో కథను తెరకెక్కించిన చిత్రంలో హీరోయిన్ గా తొలిసారి నటిస్తున్నాను. మీ అందరి కోసం ఈ పాత్రలో ఎంతో కష్టపడి పని చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ‘రెయిన్‌బో’ కచ్చితంగా మిమ్మల్ని అలరించే, ఉత్తేజపరిచే సినిమా. అమ్మాయితో ప్రేక్షకుల ప్రయాణం ఓ క్రేజీ రైడ్‌గా ఉంటుంది” అని తెలిపింది.  ఇక ఈసినిమాకు ఎడిటర్ గా  ఇ. సంగతమిజన్ వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా  వినీష్ బంగ్లాన్, ఆర్ట్ డైరెక్టర్ గా సుబెంథర్ పిఎల్ పని చేస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా తంగప్రభాకరన్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అరవేంద్రరాజ్ బాస్కరన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  


Read Also: రావణాసుర To శాకుంతలం, ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!