ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షల ఫలితాలను మార్చి 29న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. నియామక ప్రక్రియలో భాగంగా నాన్ టెక్నికల్ విభాగాల్లోని ఉద్యోగాలకు ఏప్రిల్ 10 నుంచి 24 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలు ఇలా..
అభ్యర్థులకు సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులున్నందున ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టుల నుంచి ఖాళీలను అనుసరించి నిర్ణీత సమయంలో రెండో ఎంపిక జాబితా వెలువడనుంది. తదుపరి ఖాళీలను బట్టి అవసరమైతే, మూడో ఎంపిక జాబితా కూడా ప్రకటిస్తారు. టెక్నికల్ విభాగంలోని స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నియామకాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కీని విడుదల చేసింది. రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న ప్రకటించారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.
Also Read:
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 మెయిన్స్ పరీక్ష తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ఖరారు చేసింది. పరీక్షను జూన్ 5న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 25న రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుం మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును పరీక్షకు కొన్నివారాలకు ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..