సినిమా జనాలకు పండగలు అనేవి చాలా ముఖ్యం. ప్రతి పండగకి సినిమాలను రిలీజ్ చేస్తూ.. క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీపావళి సీజన్ కావడంతో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. నిజానికి టాలీవుడ్ కి దీపావళి పెద్దగా కలిసిరాదు. ఎన్ని సినిమాలు వచ్చినా.. పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఈసారి కూడా అలానే జరిగింది. దీపావళి కానుకగా మొత్తం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో దేనికీ కూడా పాజిటివ్ టాక్ రాలేదు. 


Also Read: ఇద్దరమ్మాయిలతో అఖిల్ రొమాన్స్.. వర్కవుట్ అవుతుందా..?


మంచి రోజులు వచ్చాయి.. 


మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. ఒక చిన్న సినిమాకి ప్రీమియర్లు వేయడమనేది మామూలు విషయం కాదు. ఎంతో నమ్మకం ఉంటేనే మేకర్స్ రిస్క్ చేస్తారు. అయితే మారుతి తీసుకున్న ఈ రిస్క్ తుస్సుమంది. సినిమాలో కామెడీ బాగున్నప్పటికీ.. కథ సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో . ఈ సినిమాలో సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకోదు. 


పెద్దన్న.. 


రజినీకాంత్-శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో ఎనభై కాలంలో వచ్చిన సినిమా కథని తీసుకొని 'పెద్దన్న' తీశారా..? అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అప్పటికథలు ఇంకా బెటర్ గా ఉండేవి. రజినీకాంత్ ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ని నమ్ముకొని ఈ సినిమా తీశారు. అయితే రజిని ఫ్యాన్స్ ను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఖుష్బూ, మీనాల ఓవరాక్షన్, కీర్తి సురేష్ ఏడుపు సినిమాపై విరక్తి వచ్చేలా చేసింది. రజినీకాంత్ ఎప్పటిలానే మాస్ డైలాగ్స్, యాక్షన్ తో ఆకట్టుకున్నా.. కథ-కథనాల్లో సత్తా లేకపోవడంతో సినిమా తేలిపోయింది. 


ఎనిమీ.. 


విశాల్-ఆర్య లాంటి టాలెంటెడ్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో 'ఎనిమీ'పై అంచనాలు పెరిగిపోయాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. కేవలం యాక్షన్ తప్ప మిగిలిన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం.. లాజిక్ లేని మైండ్ గేమ్ సినిమాపై ఎఫెక్ట్ చూపించాయి. కొన్ని చోట్ల ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. కొన్ని చోట్ల మాత్రం చాలా డల్ గా ఉంది. ఎన్ని వసూళ్లు రావాలన్నా.. అది ఈ మూడు రోజులే. 


Also Read: యంగ్ టైగ‌ర్ కోసం సూప‌ర్‌స్టార్‌... మ‌హేష్‌తో ఎన్టీఆర్ షో క్లైమాక్స్‌!


Also Read: హీరో రాజ‌శేఖ‌ర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు


Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు


Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...


Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి