Koratala Siva Remuneration: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. ఆయన కెరీర్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పాన్ ఇండియన్ మూవీ ‘దేవర’ను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. మూవీకి సంబంధించి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.


‘దేవర’ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న కొరటాల


పాన్ ఇండియన్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘దేవర’ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను కొరటాల శివ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘దేవర’ మూవీకి ఆయన ఏకంగా రూ. 30 కోట్లు తీసుకుంటున్నారట. ఎన్టీఆర్ తో కలిసి ‘జనతా గ్యారేజ్’ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన నేపథ్యంలో, ‘దేవర’ మరింత సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావించారట. పాన్ ఇండియా హిట్లు అందుకున్న రాజమౌళి, నాగ్ అశ్విన్ తో సమానంగా కొరటాలను భావిస్తున్నారట. అందుకే, దర్శకుడికి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతంటే?


అటు ‘RRR’ సినిమాకు రూ. 45 కోట్ల పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్.. ‘దేవర’ సినిమాకు మరింత పెంచారట. ఈ సినిమాలో నటనకు గాను ఆయన ఏకంగా రూ. 60 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ రూ. 10 కోట్లు తీసుకుంటున్నారట. ‘దేవర’ సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతున్న జాన్వీ  రూ. 3.5 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు మరో రూ. కోటి ట్రావెలింగ్, హోటల్ ఖర్చులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ రూ. అర కోటి అందుకుంటున్నారట. 



పాన్ ఇండియన్ డైరెక్టర్ల లిస్టులో చేరేనా?


ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాను తీసేందుకు కొరటాల 2 సంవత్సరాలు టైం తీసుకున్నారు. దర్శకుడు కొరటాల తెలుగు సినిమా పరిశ్రమలో పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదిరిపోయే  స్క్రిప్లు, డైలాగ్స్‌ రాయడంలో మంచి పేరుంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ చిత్రాలతో అద్భుత విజయాలను అందుకున్నారు.  ‘దేవర’ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, కొరటాల ఏకంగా పాన్ ఇండియా దర్శకుల లిస్టులో చేరనున్నారు. అంతే కాదు, తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచే అవకాశం ఉంది.


Also Read: ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌ - బీస్ట్‌ మోడ్‌లో గ్లోబల్‌ స్టార్‌, ఆర్‌సీ 16 లోడింగ్‌...



Also Read: ఎన్టీఆర్‌కు కాదు, కొరటాలకే అగ్ని పరీక్ష... 'దేవర' రిజల్ట్ దర్శకుడి కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్