బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంటుంది. రీసెంట్ గా ఈమె ప్రధాన పాత్రలో 'ధాకడ్' అనే సినిమా తెరకెక్కింది. రజనీష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు ఓ రేంజ్ లో బజ్ వచ్చింది. 


కంగనా యాక్షన్ సీన్స్ లో ఇరగదీసింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మొదటి రోజు నుంచే సినిమాకి నెగెటివ్ టాక్ మొదలైంది. రూ.80 నుంచి రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కంగనా కెరీర్ లో ఇదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. మొదటి వీకెండ్ లో కాస్తో కూస్తో వసూలు చేసిన ఈ సినిమా రెండో వారానికి పూర్తిగా డల్ అయింది. 


'ధాకడ్' థియేట్రికల్ జర్నీలో 8వ రోజు దేశవ్యాప్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఎనిమిదవ రోజు కలెక్షన్స్ రూ.4,420. దీన్ని బట్టి ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాకి వచ్చిన టాక్ తో డిజిటల్ రైట్స్ దక్కించుకోవడానికి కూడా ఏ సంస్థ ముందుకు రావడం లేదు. దర్శకనిర్మాతలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమాతో పాటు విడుదలైన 'భూల్ భులైయా2' సినిమా మాత్రం బాక్సాఫీస్ ను షాక్ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హారర్ కామెడీ రూ.100 కోట్ల మార్క్ ను అందుకోబోతుంది. కానీ 'ధాకడ్' మాత్రం మినిమమ్ కలెక్షన్స్ లేక బోల్తా కొట్టింది. 


Also Read: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్


Also Read: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్