Tour of Duty Scheme : సైన్యం, వైమానిక దళం, నౌకాదళ సైనిక సేవలు రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం రిక్రూట్ చేసిన సైనికులందరూ 4 సంవత్సరాల తర్వాత సర్వీస్ నుండి విడుదల అవుతారు. అంతే కాదు సర్వీస్ నుంచి రిలీజ్ అయిన వారిలో 25 శాతం మందిని ఒక నెల తర్వాత పూర్తి సేవల కోసం తిరిగి చేర్చుకోవడం తప్పనిసరి. ఈ మార్పులను టూర్ ఆఫ్ డ్యూటీ/అగ్నీపథ్ పథకంలో భాగంగా చేపట్టబోతున్నారు.
సైనికులకు ప్రయోజనం
విశ్వసనీయ సోర్సెస్ ప్రకారం, ఈ మార్పులకు సంబంధించి అధికార సంస్థల మధ్య అనేక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణల తర్వలోనే అమలు కావోచ్చని తెలుస్తోంది. ఒకసారి ఈ విధానాలు అమలులోకి వస్తే సైనికులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. మొదటి ప్రతిపాదనలో 3 సంవత్సరాల యాక్టివ్ సర్వీస్ తర్వాత నిర్దిష్టమైన శాతం రిక్రూట్‌లను విడుదల చేయాలని నిర్దేశించారు. మరో ప్రతిపాదనలో 5 సంవత్సరాల సైనిక సేవ తర్వాత రిలీజ్ చేయాలని, 25 శాతం మందిని తిరిగి తీసుకోవాలి. అయితే ఇప్పుడు కొత్త ప్రతిపాదన దానిని అధిగమించే అవకాశం ఉంది. సైనికులకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, కొత్త మార్పులు గణనీయమైన మొత్తంలో డబ్బును కూడా ఆదా చేయగలవు.
ట్రేడ్స్ ప్రకారం మినహాయింపులు
సోర్సెస్ ప్రకారం కొంతమంది సైనికులు తమ ట్రేడ్స్ ప్రకారం ఈ విషయంలో మినహాయింపు పొందుతారు. అలాగే వారి సేవలు, అనుభవం కారణంగా ప్రతిపాదిత 4 సంవత్సరాల సర్వీస్‌కు మించి కొనసాగించవచ్చు. దాదాపు 2 సంవత్సరాలుగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నెమ్మదించింది. సరిహద్దుల్లో పరిస్థితుల కారణంగా సైనికుల్లో సహజంగానే ఆందోళన ఉంటుంది. వాస్తవానికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో జాప్యంపై పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో నిరసనలు కూడా జరిగాయి. వయో భారం వల్ల భవిష్యత్తులో తమకు సర్వీస్ అవకాశం రాకుండా పోతుందనే ఆందోళన సైనికుల్లో నెలకొంది. హరియాణాలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, తీవ్ర నిరాశతో కొందరు సైనికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
సైనికుల స్థాయిలో యువతను చేర్చడానికి 'టూర్ ఆఫ్ డ్యూటీ' పథకాన్ని సైనిక వ్యవహారాల విభాగం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దీనికి తుది ప్రక్రియను పూర్తి చేయబోతున్నందున వార్తలు వస్తున్నాయి. ప్లాన్ ప్రకారం స్కీమ్‌కు సెవెరెన్స్ ప్యాకేజీ, సర్టిఫికేట్, డిప్లొమా ఉంటుంది. ఆర్మీలో పనిచేసిన తర్వాత సైనికులకు ఇది ఉపయోగపడుతుంది.