స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్(Devi Sri Prasad) ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. యాక్సిడెంట్ లో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్న దేవీశ్రీప్రసాద్ బాబాయ్ గొర్తి బుల్లి బుల్గానిన్ మృతి చెందారు. తమ్ముని మరణవార్త విన్న షాకైన ఆయన అక్క (దేవీశ్రీప్రసాద్ మేనత్త) కొమ్ముల సీతామహలక్ష్మి హార్ట్ ఎటాక్ తో మరణించడం కుటుంబంలో విషాదాన్ని నింపేసింది.
Also Read : ''నేను చాలా బిజీ.. రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో పెద్దగా పట్టించుకోలేదు''
తూగోజిల్లా రాయవరం మండలం వెదురుపాక దేవీశ్రీ ప్రసాద్ స్వగ్రామం. ఆయన తండ్రి సినీ రచయిత సత్యమూర్తి. ఆయన గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ 'దేవత' సినిమాతో సినీరంగంలో ఆరంగేట్రం చేశారు. తదుపరి దర్శకునిగానూ మారారు. సత్యమూర్తి తండ్రి నారాయణ కమ్యూనిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. ఆయనకి ముగ్గురు కొడుకులు , ముగ్గురు కూతుళ్ళు. పెద్దకూతురు సీతామహలక్ష్మి, తర్వాత కొడుకు హరినారాయణ, సత్యమూర్తి, బుల్జ్యోగానిన్, జ్యోతి, గౌరీపార్వతి మొత్తం ఆరుగురు సంతానం.
రష్యన్ కమ్యూనిస్ట్ లీడర్ బుల్గానిన్ చనిపోయిన రోజున పుట్టడంతో.. నారాయణ తన చిన్న కొడుక్కి ఆ పేరు పెట్టారు. సీతామహలక్ష్మి ప్రోత్సాహంతోనే సత్యమూర్తి సినీరంగంలో ఎంటర్ అయ్యారు. అందుకే దేవీశ్రీప్రసాద్ ఫ్యామిలీకి సీతామహలక్ష్మి అంటే అపారమైన ప్రేమాభిమానాలు. బాబాయ్, మేనత్తలు ఆకస్మికంగా మృతి చెందడంతో దేవశ్రీప్రసాద్ .. ఆయన తమ్ముడు సింగర్ సాగర్ అండ్ ఫ్యామిలీ శోక సముద్రంలో మునిగిపోయారు. బుల్లి బుల్గానిన్ కొడుకు విజయ్ బుల్గానిన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్.
'దేవి' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అయిన DSP ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ రేసులో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలంటే ముందుగా దేవిశ్రీకే అవకాశాలు వస్తుంటాయి. ప్రస్తుతం దేవి.. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలో 'దాక్కో దాక్కో మేక' అనే పాటను విడుదల చేశారు. ఇది యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో పాటు రవితేజ నటిస్తోన్న 'ఖిలాడీ' సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read : అపోలో హాస్పిటల్‌కు బన్నీ.. సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
Also Read : అరే ఏంట్రా ఇది? బయట దీప్తితో.. ఇంట్లో హమీదాతో లవ్! షన్నుకు బర్త్‌డే సర్‌ప్రైజ్
Also Read: పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు