మాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'. సోమవారం (జనవరి 8న) వీడియో గ్లింప్స్ విడుదల కానుంది. అంత కంటే ముందు ఎన్టీఆర్ అభిమానులకు మరో అప్డేట్! అది ఏమిటంటే... 


ఆడియో రైట్స్ @ టీ సిరీస్!
Devara Audio Rights: బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన టీ సిరీస్ సంస్థ 'దేవర' ఆడియో రైట్స్ సొంతం చేసుకుంది. ఆ ఛానల్‌లో 'దేవర' వీడియో గ్లింప్స్ విడుదల కానుంది. ఆల్రెడీ ఆ వీడియో కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 'డెవిల్' విడుదల సందర్భంగా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ చెప్పిన విషయాలు గానీ, సంగీత దర్శకుడు అనిరుద్ చేస్తున్న ట్వీట్స్ గానీ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచాయి.


Also Readలవర్‌కు హ్యాండ్ ఇస్తున్న 85 శాతం అమ్మాయిలు - రీసెంట్ రీసెర్చ్ గురించి 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ ఏమన్నారంటే?






ఏప్రిల్ 5న 'దేవర' ఫస్ట్ పార్ట్ విడుదల
Devara Release Date: 'దేవర' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ఎప్పుడో తెలిపారు. అందులో తొలి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మరో సందేహం లేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.


Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?






ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న 'దేవర' చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతలు. 'విక్రమ్', 'జైలర్', 'జవాన్'... వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.


Also Read#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్



'దేవర' సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య పాత్రలో సీరియల్ నటి చైత్ర రాయ్, కీలక పాత్రలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప నటిస్తున్నారు. నటి హిమజ సైతం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 


రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్!
అనగనగా ఓ సముద్ర తీరం! అక్కడ ఓ రాయల్ ఫ్యామిలీ ఉంటుంది. నరరూప రాక్షసుల వంటి మృగాల చేతిలో ఆ తీర ప్రాంత ప్రజలు దాడికి గురి అవుతారు. వాళ్ళ సంరక్షణ బాధ్యత తమది అని రాజ కుటుంబం మాట ఇస్తుంది. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న రాయల్ ఫ్యామిలీ వారసుడు ఎన్టీఆర్ అడుగు పెట్టి... రాక్షస సంహారం చేస్తారు. మృగాల మధ్య పెరిగిన మేలిమి ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. - ఇదీ కథ అని ఐఎండిబి వెబ్ సైట్ పేర్కొంది.