Custody movie Day3 Collections: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అక్కినేని నాగ చైతన్య ‘కస్టడీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని చవి చూసింది. మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. వసూళ్ల పరంగానూ తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి వీకెండ్ లో నాగ చైతన్య చిత్రం కేవలం రూ. 6.6 కోట్లు మాత్రమే వసూళు చేసింది. రెండు భాషల్లో కలిపి తొలి రోజు ఈ సినిమా  భారత్ లో రూ. 3.2 కోట్లు వసూలు చేసింది. నాగ చైతన్య లాంటి హీరోకి ఇది చాలా తక్కువ. సాధారణంగా సినిమాలు తొలి వీకెండ్ లో కలెక్షన్లు బాగా వసూళ్లు చేస్తాయి. అయితే, ‘కస్టడీ’ భారీ నష్టాన్ని చవిచూసింది.  శనివారం (మే 13), ఆదివారం (మే 14) కేవలం రూ. 3 కోట్ల మాత్రమే వసూలు చేసింది. ఆదివారం నాడు ఈ సినిమా కేవలం రూ.1.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో టోటల్ కలెక్షన్ రూ.6.63 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రం మే 14న తెలుగులో 23.45 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది.


బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన 'కస్టడీ'


అక్కినేని నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు 'కస్టడీ' సినిమాను తెరకెక్కించారు.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు.  కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా, ఈ సినిమాకు అన్ని చోట్లా  మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. విడుదలైన తొలి రోజు నుంచే తక్కువ కలెక్షన్లు వచ్చాయి.  ‘కస్టడీ’ చిత్రానికి మార్కెట్ లో పెద్ద హైప్ లేకపోవడం తో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే జరిగాయి. ఇక డివైడ్ టాక్ రావడం తో మ్యాట్నీస్ కి మార్నింగ్ షోస్ తో పోలిస్తే 50 శాతానికి పైగా డ్రాప్స్ పడ్డాయి.  ఫస్ట్ షోస్ కి మ్యాట్నీస్ తో పోలిస్తే 70 శాతం వరకు వసూళ్లు డ్రాప్ అయ్యాయి. 


కస్టడీ మూవీ బిజినెస్ ఎంతంటే?


'కస్టడీ' మూవీకి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ అందుకుంది. కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.20 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్ల బిజినెస్ లభించింది.






Read Also: ‘ది కేరళ స్టోరీ’ స్టార్ అదా శర్మకు యాక్సిడెంట్, ప్రస్తుతం ఆమె కండీషన్ ఎలా ఉందంటే?