సినీ నటుడు అలీ కూతురు ఫాతిమా వివాహం ఇటీవలే హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అలీ అటు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉండటంతో ఆయన కుమార్తె పెళ్ళికి సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఫాతిమా పెళ్లి కి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. తాజాగా అలీ భార్య జుబేదా అలీ యూట్యూబ్ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో కూతురు ఫాతిమా పెళ్లి వీడియోలను పోస్ట్ చేశారు. 



కుమార్తె షాపింగ్ దగ్గర నుంచి పెళ్లి కూతుర్ని చేయడం వరకూ ఇలా అన్ని సందర్భాలనూ వీడియో తీసారు. ఈ వీడియోలన్నిటినీ జత చేసి ఓ పెద్ద వీడియో గా క్రియేట్ చేశారు. అంతేకాదు ఆ వీడియోను జుబేదా అలీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇందులో పెళ్లి కూతురుని చేయడం దగ్గర నుంచి పెళ్లి కొడుకుని మండపం దగ్గరకు తీసుకుని రావడం. అలాగే పెళ్లి లో జరిగే తంతులో కూతురు ఫాతిమా ఎమోషనల్ వరకూ పెళ్లి ఎలా జరిగిందో అన్నీ ఈ వీడియోలో కవర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫాతిమా జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.




అలీ బాల నటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తరువాత స్టార్ కమెడియన్ ఎదిగారు. తన నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇండస్ట్రీలో దాదాపు అందిరి హీరోలతో పనిచేశారు. కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా చేసి ఎన్నో అవార్డులు అందుకున్నారు అలీ. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు అలీ. ఈటీవీ లో ప్రసారం అవుతున్న ‘అలీ తో సరదాగా’ వంటి కార్యక్రమాలు అలీ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.  అలీ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉంటున్నారు. 


Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు