టిక్కెట్ రేట్ల అంశంపై వారం, పది రోజుల్లో కొత్త జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌తో దాదాపుగా గంటన్నసేపు జరిగిన భేటీ తర్వాత తిరిగి వెళ్తూ విజయవాడ ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌తో జరిగిన సమావేశం సంతృప్తి కరంగా సాగిందన్నారు. జగన్ ఆహ్వానం మేరకే తాను ఈ రోజు వచ్చానని ఇండస్ట్రీ సమస్యలను వివరించానన్నారు. పది రోజుల్లో సినీ పరిశ్రమ తరపున డ్రాఫ్ట్ తయారు చేసి ఇస్తే దాన్నే జీవోగా ఇస్తామని హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు. 


Also Read: ఏపీలో టికెట్ రేట్స్‌తో మాకు స‌మ‌స్య‌ లేదని ఎందుకు అన్నానంటే.. నాగార్జున వివరణ!


సినిమా ఇండస్ట్రీ పైకి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్ కాదని చిరంజీవి స్పష్టం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల వేల మందిఉన్నారన్నారు. కరోనా కారణంగా ఇండస్ట్రీలో అనిశ్చిత వాతావరణ ఏర్పిడందని... ఎంతో మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. దీనికి తోడు టిక్కెట్ రేట్లు ఇతర సమస్యల వల్ల గత కొన్ని నెలలుగా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. ఈ సమస్యలన్నింటినీ సీఎం ముందు పెట్టానన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కష్టాలు.. నిర్మాతల సమస్యలు ఇలా అన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సీఎం జగన్ తనకు సోదరుడి లాంటి వారన్నారు.


Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..


 తాను ఎవరి పక్షాన ఉండనని.. అందరిని సమదృష్టితో చూస్తానని సీఎం జగన్ చెప్పారని చిరంజీవి తెలిపారు. వారం పది రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.  ఫిల్మ్ చాంబర్, ఎగ్జిబిటర్ ప్రతినిధులను పిలిచి మీటింగ్ పెడతామని జగన్ తెలిపినట్లుగా చిరంజీవి తెలిపారు. సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది కాబట్టి అందరూ సంయమనం పాటించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. 


Also Read: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...


ధరలు పెంచుతారా.. తగ్గిస్తారా అన్నది కాదు.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్యులకు అందుబాటులోకి వినోదాన్ని తెచ్చేందుకే టిక్కెట్ రేట్లు తగ్గించామన్న జగన్ ప్రకటనపై చిరంజీవి భిన్నంగా స్పందించారు.  వినోదాన్ని పేదలకు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయం మంచిదన్నారు. ఈ విషయంలో జగన్‌ను అభినందిస్తున్నానన్నారు. ఏదో మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోందన్నారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి