Prithviraj Drank Vodka for AaduJeevitham The Goat Life : ది గోట్​ లైఫ్​. తెలుగులో ఆడు జీవితం. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాధారణ మంచిగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించలేదు.. జీవించాడనే అంటున్నారు. డైరక్టర్ చూపించిన ప్రతి డిటైలింగ్​కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాకు అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి టాక్​ వస్తుంది. అయితే పృథ్వీరాజ్ ఓ రోజు సెట్​లో వోడ్కా తాగారంటూ ఆ సినిమాటోగ్రాఫర్ సునీల్ చెప్పారు. దాని తర్వాత అతనిని సెట్​లోకి చైర్​పై మోసుకెళ్లాల్సి వచ్చిందంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అదేంటి సెట్​లో మందు తాగడం.. అని అనుకోకండి. దీని వెనుక కథ తెలిస్తే.. పృథ్వీరాజ్ ఎంత డెడికేటెడ్​ యాక్టరో మీకు తెలుస్తుంది.


ఒకటి కాదు రెండు.. ఏకంగా 16


పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో పెద్ద స్టార్. హీరోగానూ నటించగలడు.. విలన్ పాత్రల్లోనూ జీవించగలడు. ​తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. సలార్ సినిమా ఆయనను మొత్తం ఇండియాలోని సినీ ప్రేక్షకులకు దగ్గర చేసింది. మలయాళం ఇండస్ట్రీని టాప్​లోకి తీసుకువెళ్లాలని ఉందని.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పృథ్వీ. ఇది ముందు నుంచే తన మైండ్​లో పెట్టుకున్న పృథ్వీకి వచ్చిన ఆలోచనే ఆడు జీవితం. ఈ సినిమాపై పృథ్వీరాజ్ 16 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం షూటింగ్ స్టార్ చేసి.. ఓ సంవత్సరం పోస్ట్ ప్రొడక్షన్ చేసి.. ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఒక్క సినిమా కోసం ఇంత కష్టాన్ని ఎందుకు పడ్డారో.. సినిమా చూస్తే అర్థమవుతుంది. 


పాత్రకోసం జీవించేశాడుగా..


ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఓ సినిమాని రోజుల్లో, నెలల్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. కొన్ని క్లాసికల్స్ తీయడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఓ జీవితాన్ని ఆవిష్కరించడానికి దశాబ్ధంన్నరకు పైగా కష్టపడి.. సినిమాను ఆవిష్కరించారు మేకర్స్. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పృథ్వీరాజ్ నటన గురించే. ఆయన నటించలేదు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ KS సునీల్ పృథ్వీరాజ్ నటనకోసం ఎంత దూరమైన వెళ్తారని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 


కుర్చీలో తీసుకెళ్లాల్సి వచ్చింది


ఈ సినిమాకోసం పృథ్వీరాజ్ 31కిలోలు తగ్గాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎడారిలో నటించాల్సి ఓ సీన్​ కోసం అతను చేసిన రిస్క్ చూస్తే ఏమి మనిషివి స్వామి నువ్వు అనాలనిపిస్తుంది. ''ఓ సీన్​ కోసం పృథ్వీరాజ్ మూడురోజులు ఉపవాసం చేశాడు. చివరి రోజు తన శరీరంలో ఉన్న నీటిని కూడా పోగొట్టుకోవడానికి ఆయన 30ML వోడ్కా తీసుకున్నాడు. ఆ సమయంలో అతను పూర్తిగా డీహైడ్రేట్​ అయిపోయి.. లేవలేని పరిస్థితిలో ఉండగా.. అతనిని కుర్చీలో కూర్చోబెట్టి.. షూటింగ్ ప్లేస్​కి తీసుకెళ్లారు.'' అంటూ సునీల్ తెలిపారు. ఆహారంలేని వ్యక్తి దాహాంతో అలమటించేలా కనిపించేందుకు సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో పృథ్వీ ఇలా చేశారని వెల్లడించారు. అతని డెడీకేషనే ఆడియన్స్ అందరినీ.. పృథ్వీ నటించిన పాత్రలో లీనమయ్యేలా చేసింది.


Also Read : బరువు తగ్గడంలో హెల్ప్ చేసే వోట్​మీల్ డ్రింక్.. రెండు నెలల్లో 20 కిలోలు తగ్గవచ్చట!