Oat Ozempic Weight Loss : సోషల్ మీడియాలో బరువు తగ్గడానికి అది తాగండి.. ఇది తినండి అంటూ చేసే వీడియోలు తెగ వైరల్ అవుతాయి. వాటిలో ఓట్జెంపిక్ కూడా ఒకటి. బరువు తగ్గడంలో ఇది అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది అంటూ.. ఇన్ఫ్లూయెన్సర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇది టిక్‌టాక్ (ఇండియాలో కాదు) బాగా వైరల్ అవుతుంది. ఈ ట్రెండ్ మెల్లిగా ఇన్‌స్టా రీల్స్‌లోకి వచ్చింది. అయితే బరువు తగ్గడానికి ఈ డ్రింక్ హెల్ప్ చేస్తుందా లేదా అనే దానిపై నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
రెండునెలల్లో 18 కేజీలట..
ఓట్జెంపిక్ ఛాలెంజ్‌పై నిపుణులు స్పందించారు. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలను వారు అంచనా వేశారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి? బరువు తగ్గడంలో ఇది నిజంగా హెల్ప్ చేస్తుందా? లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఓట్జెంపిక్ డ్రింక్ తయారు చేసుకోవడానికి.. ఇన్స్టాంట్ ఓట్స్, నీరు, నిమ్మరసం కావాల్సి ఉంటుంది. దీనిని స్మూతీగా చేసుకుని రెండు నెలలు తాగితే.. 18 కేజీలు బరువు తగ్గవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే వారు ప్రతిరోజు దీనిని తాగాల్సి ఉంటుంది. ఇలా రెండు నెలలు చేసి.. దాని రిజల్ట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు.
నిజంగానే బరువు తగ్గవచ్చు
ఈ ఓట్జెంపిక్ డ్రింక్‌పై నిపుణులు స్పందించారు. దీనిని తాగడం వల్ల ఆకలి తగ్గుతుందని.. ఎక్కువసేపు ఆకలి వేయకవడం వల్ల చిరుతిళ్ల జోలికి వెళ్లరు. ఇది జీర్ణవ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తుందని నిపుణులు తెలిపారు. ఇది చాలా ఆరోగ్యకరమైన, పోషకమైన అల్పాహారంగా చెప్తున్నారు. దీనిని తాగడం వల్ల నలభై పౌండ్లు తగ్గడం అసాధ్యమే అయినా.. కొంతవరకు బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. దీనిని రెగ్యూలర్‌గా తీసుకోవడం పేగుల్లో కదలిక మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.
ఆ పద్ధతుల్లో బరువు తగ్గితే మంచిది..
ఈ డ్రింక్ వల్ల బరువు తగ్గడంతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉంది అంటున్నారు. అయితే ఓజెంపిక్ అనే మెడిసెన్ను మధుమేహం చికిత్సలో భాగంగా తయారు చేసిన ఔషధంగా చెప్తున్నారు. దీనిని వారానికి ఓసారి ఇంజెక్ట్ చేసుకుంటే.. అది ఆకలిని గణనీయంగా తగ్గిస్తుంది. అలాంటిదానిని కొందరు బరువును వేగంగా తగ్గడం కోసం ఉపయోగిస్తున్నారు. ఇది అస్సలు మంచిది కాదు అంటున్నారు. ఇది బరువును తగ్గడంలో హెల్ప్ చేస్తాయి కానీ.. కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు. మలబద్ధకం, అతిసారం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా త్వరగా బరువు తగ్గిపోయే విధానాలపై ఆధారపడే బదులు.. హెల్తీ పద్ధతిలో బరువు తగ్గేలా చూసుకోవాలి అంటున్నారు. వ్యాయామం.. మంచి ఫుడ్.. హెల్తీ లైఫ్‌స్టైల్‌తో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు.
Also Read : ధోని ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ కొట్టడం అందుకే సాధ్యమైంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.