Satyabhama Today Episode: మహదేవయ్య క్రిష్‌తో మాట్లాడాలి అని పిలుస్తాడు. రుద్ర, భైరవి కూడా అక్కడే ఉంటారు. ఏదో మాట్లాడటానికి పిలిచావు ఏంటి బాపు అని క్రిష్ మహదేవయ్యని అడుగుతాడు. దీంతో మహదేవయ్య ఏం చెప్పాలిరా చెప్తే మీరు బాధపడతారు. చెప్పకుంటే నేను బాధపడతాను. ఏం చేయమంటావో చెప్పు అని అడుగుతాడు.


రుద్ర: నువ్వు బాధ పడితే మేం చూడలేం బాపు.. మా దగ్గర తప్పు ఏమైనా జరిగుంటే చెప్పు దిద్దుకుంటామ్.
మహదేవయ్య: ఇది తప్పొప్పుల సమస్య కాదురా.. నా మనసులో తీరని కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అని మనసులో ఉంది. దిగులు పుడుతుందిరా.
క్రిష్: ఏంటి బాపు అది. ఇన్ని దినాలు నాకు ఏం చెప్పలేదు. 
మహదేవయ్య: ఇప్పుడు నీకు ఆ కోరిక తీర్చే అర్హత వచ్చింది కాబట్టి చెప్తున్నా. 
భైరవి: ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్ పెనిమిటి. నీ మనసులో ఏముందో అది చెప్పు.
మహదేవయ్య: ఏం లేదురా. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ ఇంట్లో పసి బిడ్డల బోసి నవ్వులు చూడాలి అని ఉంది. పెద్దొడికి తొందర పడి పెళ్లి చేశాను. 
రుద్ర: ఇంతలో రేణుక వస్తే.. ఏయ్ ఎవరు రమ్మన్నారు నిన్ను లోపలికిపో.
భైరవి: ఉండనివ్వరా అది కూడా వినని.
మహదేవయ్య: పెద్దొడి పెళ్లి జరిగి మూడేళ్లు అయినా ఇప్పటి వరకు బిడ్డల ముచ్చటే లేదు. బిడ్డలు లేరు అని వాడి ముఖంలో దిగులు కూడా లేదు.
రుద్ర: ఇప్పుడు ఇదంతా ఎందుకు బాపు.
మహదేవయ్య: నా మనసులో బాధ మీరే చెప్పమన్నారు కదరా.. భైరవి గోల్డ్ చైన్ తీసుకొని వస్తుంది. అది మహదేవయ్య చూపిస్తూ.. ఈ ఇంటి వారసుడి కోసం మూడేళ్ల క్రితం చేయించా ఇది ఇప్పటి వరకు బీరువాలోనే ఉంది. మీ అన్న మీద ఆశలు వదులుకున్నారా.. ఎంతకాలం అని ఎదురు చూస్తా.. ఇప్పుడు మీ వంతు వచ్చింది వేరే ఆలోచిన పెట్టుకోకుండా మీ బాపు కోరిక నెరవేర్చుతావా.. ఏంట్రా మాట్లాడవు. నాకీ చైన్‌తో పని పడుతుందా.. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటే ఏమనుకోవాలి.
భైరవి: వాడికి ఇప్పుడే కదా తొలిరాత్రి అయింది. ఒక ఏడాది టైం ఇవ్వండి. నీ సమాధానం చెప్పురా నీకు చెప్పడం కష్టం అయితే ఉండు సత్యని పిలుచుకొని వస్తా.
క్రిష్: ఈ చిన్న ముచ్చటకు సత్యను పిలవాలా.. నేను మాటిస్తున్నా ఒక ఏడాది ఆగండి చాలు.  
మహదేవయ్య: చాలు బిడ్డా ఈ భరోసా చాలు.
భైరవి: చూశావా నీ బాపు హుషారు చూశావా మాట నిలబెట్టకోవాలి.
మహదేవయ్య: అవును ముడుపు పూజ సంగతి ఏంటి..
భైరవి: నేను చూసుకుంటా..


మరోవైపు నందిని తల్లి భైరవికి కాల్ చేసి ఫస్ట్ నైట్ అవ్వలేదని జరిగింది అంతా చెప్తుంది. ఇప్పట్లో హర్ష తన జోలికి రాడు అని చెప్తుంది. ఇక రోజుకో గొడవ పెడుతున్నానని.. అత్తామామల గది తీసుకున్నాను అని చెప్తుంది. ఇక భైరవి వీలైనంత తొందరగా ఆ ఇంట్లో మంట పెట్టమని చెప్తుంది. ఇక విడాకుల గురించి నువ్వే చూసుకో అని నందిని తల్లికి చెప్తుంది. 
 
భైరవి ఇంట్లో ముడుపు పూజకు ఏర్పాట్లు జరుగుతుంది. ఇక సత్య దేవుడి ఎదుట కూర్చొని దీప వెలిగించబోతుంటే భైరవి సత్యని ఆపుతుంది. సత్య నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా.. ముడుపు పూజ ఎలా చేయాలో మీ అమ్మ నేర్పించలేదా అని తిడుతుంది. ఇక భైరవి విశాలాక్షికి ఫోన్ చేయమని అంటుంది. ఇదే ఛాన్స్ అని భైరవి రెచ్చిపోతుంది.


మహదేవయ్య: భైరవి నీతో ఇదే ప్రాబ్లమ్.. ఏ ముచ్చట అయినా సాగదీస్తావ్. కోడలికి కొత్త కదా నువ్వే నేర్పియ్.  
భైరవి: ఏం ఇంటి ఆచారాలు ఆ ఇంట్లో ఉంటాయి. పెద్దవాళ్లని అడిగి తెలుసుకోవాలి. అంతే కానీ నాకు అన్నీ తెలుసు పద్థతి ఇదే కదా అని దబాయిస్తుంటే నేను అమ్మ బుజ్జి అని బుజ్జగించాలా..
సత్య: అత్తయ్య నేను దబాయించడం లేదు. నా వల్ల ఎక్కడ తప్పు జరిగిందా అని అడుగుతున్నాను. నాది తప్పు అయితే నన్ను క్షమించండి. 
క్రిష్: ఏమైంది ఎందుకు అందరూ ఇట్లా ఉన్నారు.
భైరవి: ముడుపు పూజ అంటే ఏంటిరా.. ఎవరెవరు చేయాలి.
క్రిష్: కొత్తగా అడుగుతావ్ ఏంటమ్మ మొగుడు పెళ్లం కలిసి చేయాలి.
భైరవి: నువ్వు రాకుండానే నువ్వు లేకుండా నీ పెళ్లం ఒక్కదాయే కూర్చొని పూజ షురూ చేస్తుంది. అదేంటి అమ్మ నీ భర్త రావాలి కదా అని అంటే నాకు తెలుసు అని నాకు అందరి ముందు ఎదురుతిరుగుతుంది.  
క్రిష్: అరే ఇంత చిన్న దానికి బీపీ ఎందుకు. సత్య నన్ను పూజకు రమ్మని పిలిచింది అమ్మ. రెడీ అయ్యేలోపు నువ్వు పూజ షురూ చేసేయ్ అని నేనే చెప్పా. అసలు ముడుపు పూజ అని నేనే మర్చిపోయా. మన ఆచారం సత్యకు కూడా తెలీదు కదా. సత్య దగ్గరకు వెళ్లి.. సత్య ఈ ఇంటి ఆచారం ప్రకారం కొత్త పెళ్లి కొడుకు పెళ్లికూతురు పిల్లల కోసం ముడుపు కట్టాలి. ఎప్పుడైతే కోడలు నెలతప్పుతుందో ఆ ముడుపు తీసుకొని పోయి అమ్మవారి గుడిలో చెట్టుకు కట్టాలి. అది సంగతి. 
భైరవి: నా పెద్ద కోడలి చేత ముడుపు కట్టించా ఏం లాభం ఏ జన్మలో ఏం పాపం చేసిందో ఆ ముడుపు ముడుపులాగే ఉండిపోయింది. నువ్వున్నా జర మనసు పెట్టి పూజ చేయ్. 


సత్య, క్రిష్‌లు కలిసి పూజ చేస్తారు. ఇద్దరూ కలిసి ముడుపు దేవుడికి సమర్పిస్తారు. క్రిష్ సత్యతో చూశావా సంపంగి మనద్దరం దూరంగా ఉండటం ఆ అమ్మవారికి కూడా ఇష్టం లేదు. అందుకే ముడుపు రూపంలో మనల్ని దగ్గర చేస్తుంది. నువ్వు ఇలా ముడుపు పట్టుకుంటుంటే చంటి బిడ్డను పట్టుకున్నట్లుంది. ఇప్పటి కైనా అర్థమైందా నా ప్రేమ ఎంత బలమైందో. నా ప్రేమకు ఆ దేవుడే తోడున్నాడు అంటాడు. దానికి సత్య ముక్కోటి దేవతలు ఒక్కటైనా నీ కోరిక నెరవేరదు అంటుంది. క్రిష్ సత్యతో పొరపాటున కూడా ముడుపు పక్కన పెట్టకు మిగతా వారి సంగతి ఏమో కానీ మా బాపు మాత్రం వారసుడి కోసం ఆగమాగం అవుతున్నాడు. ఏడాది తిరిగే సరికి వారసుడిని కూడా ఇస్తానని మాట కూడా ఇచ్చేశా.. ఇద్దరూ కలిసి దేవుడికి ముడుపు సమర్పిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 1st: తన భర్త జాడకోసం సిటీకి బయల్దేరిన దీప, నిజం చెప్పి దీప బాధ్యత తీసుకుంటానన్న కార్తీక్!