Karthika Deepam 2 Serial Today Episode: దీప మీద పగ పట్టిన మల్లేశ్ పెద్ద మనుషుల్ని తీసుకొని ఇంటికి వస్తాడు. దీప తన భర్త అప్పునకు హామీ ఇచ్చింది అని 6 నెలలుగా వడ్డీ కూడా కట్టలేదు అని చెప్తాడు. ఇక వాళ్ల గొడవకు అనసూయ నిద్ర లేచి వస్తుంది. 


మల్లేశ్: అన్నా వీళ్లు మామూలోలు కాదు అన్న. అప్పు అడగడానికి వస్తే ఈ అత్తాకోడళ్లు నన్ను కొట్టారు. వాడెవడితోనూ కొట్టించారు. 
దీప: అబద్ధాలు చెప్తున్నాడు బాబాయ్. నేను ఎవరితో కొట్టించ లేదు.
అనసూయ: వాడు ఎవడో కొట్టడం కాదురా మగతోడు లేని ఇళ్లు కదా అని ఇంకో సారి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేనికీ పనికి రాకుండా కొడతా..
మల్లేశ్: చూశావా అన్న ఎలా భరితెగించి మాట్లాడుతున్నారో..


ఇక పెద్ద మనుషులు సెటిల్ చేద్దామని మాట్లాడుతారు. ఈ అప్పునకు తనకు ఏ సంబంధం లేదు అని అనసూయ చేతులెత్తేస్తుంది. దీప మాత్రం అప్పు తీర్చుతాను అని చెప్తుంది. దీంతో మల్లేశ్ ఆరేళ్లు అయిందని నీ భర్త రాడు అని వెటకారం చేస్తాడు. ఇక పెద్ద మనుషుల్లో ఒకడు దీపమ్మ నీ భర్త హైదరాబాద్‌లో ఉన్నాడు. డ్రైవర్‌గా పని చేస్తున్నాడు అని చెప్తాడు.


దీప: నిజమా బాబాయ్.. విన్నావా అన్న మా ఆయన సిటీలో ఉన్నాడు అంట. నేను వెళ్లి తీసుకొని వస్తాను. తనకు అడ్డు పడొద్దు అని అత్తని అడుగుతుంది. దీంతో అనసూయ కూడా నీతోనే వస్తాను అని దీపను అంటుంది. ఇక మల్లేశ్ మీరు వెళ్లే ముందు మీ ఇంటిని నా పేరున రాసివెళ్లండని అంటుంది. దీంతో అనసూయ ఇంటి జోలికి వస్తే ఊరుకొనేది లేదు అని అంటుంది. చివరకు అనసూయ నేను వెళ్లను నా కోడలే సిటీకి పోతుందని అంటుంది. అందరూ ఓకే చెప్పి వెళ్లిపోతారు. 


అనసూయ: నాలాగే నువ్వు కూడా అప్పుతో సంబంధం లేదు అని చెప్పొచ్చు కదే.
దీప: మెడలో తాళి లేకపోతే అలాగే చెప్పేదాన్ని అత్తయ్య.
అనసూయ: ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నావ్ కానీ వాడిని ఎలా వెతుకుతావే.. వాడు ఎక్కడున్నాడే..


మరోవైపు కార్తీక్ తాను కొత్తగా పెడుతున్న హొటల్ గురించి మాట్లాడుతాడు. తాను సిటీకి వెళ్తాను అని చెప్పి బయల్దేరుతాడు. దీప సైకిల్ మీద సౌర్య స్కూల్‌ దగ్గరకు వెళ్తుంటుంది. ఇంతలో ఓ మాస్టారు వచ్చి దీపని పిలుస్తాడు. కార్తీక్ తన అడ్రస్ అడిగాడు అని చెప్పాను అని ఇంటికి వచ్చాడా అని ఆ మాస్టారు ప్రశ్నలు వేస్తాడు. అయితే దీప అతనెవరో తెలీదు అని చెప్తుంది. 


కార్తీక్: సిటీకి వెళ్లడానికి బట్టలు సర్దుకుంటూ.. వెళ్లే ముందు నిన్న కలుస్తా దీప. ఏం జరిగిందో చెప్పుకుంటేనైనా నువ్వు నన్ను క్షమిస్తావు అన్న నమ్మకం, నువ్వు వినకపోయినా నీ విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నాకు ఉంది ఎందుకు అంటే నేను తప్పు చేశాను కాబట్టి. ఆ తప్పు నేను జీవితాంతం మోయలేను. వస్తున్నా దీప నీ దగ్గరకే వస్తున్నా. 


మరోవైపు దీప కూడా సీటీకి వెళ్లడానికి బ్యాగ్ రెడీ చేసుకుంటుంది. సౌర్య రావడంతో హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్తుంది దీప. ఎందుకు వెళ్తున్నాం అని సౌర్య అడిగితే మీ నాన్నని చూడటానికి వెళ్తున్నాం అని చెప్తుంది. దీంతో సౌర్య ఎగిరి గంతులేస్తుంది. 


సౌర్య: అమ్మా నాన్న ఎలా ఉంటారమ్మ. నేను ఎప్పుడు నాన్నని చూడలేదు. నాన్నని చూడగానే నాన్న అంటూ పరుగెత్తికుంటూ వెళ్లి గట్టిగా పట్టుకొని బోలేడు ముద్దులు పెట్టాలి. అందుకే నాన్న ఎలా ఉంటాడో చెప్పమ్మ.
దీప: ఉండు చూపిస్తా.. అని పాత పెట్టెదగ్గరకు వెళ్లి అందులో నుంచి అద్ధం తీసుకొని వచ్చి సౌర్యకు చూపిస్తుంది. అద్దంలో తనని తాను చూసుకున్న సౌర్య షాక్ అవుతుంది. అదంతా చూసిన అనసూయ కూడా అలా ఉండిపోతుంది.
సౌర్య: ఏంటి నాన్న నాలా ఉంటారా.. దీంతో సౌర్య అద్దంలో తనకి తాను ముద్దు పెట్టుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న అంటుంది. 
అనసూయ: ఏమే నీకు కొంచెం అయినా బుద్ధి ఉందా. వాడు ఇంకా ఎక్కడున్నాడో తెలీదు దానికి ఎందుకే లేనిపోని ఆశలు పెడతావు.
దీప: మరేం చెప్పమంటారు. మీనాన్న ఊరంతా అప్పులు చేసి పారిపోయారు. అప్పులకు ఇళ్లు ఎక్కడికి పోతుందా అని పారిపోయిన మీ నాన్నని వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పాలి. ఆరేళ్ల పిల్ల మా నాన్న ఎలా ఉంటారు అమ్మ అని అడిగితే నిజానికి ఆ మాట విన్న తల్లి గుండె పగిలి చచ్చిపోవాలి. అయినా బతికి ఉంది అంటే అది ఎప్పుడో మానసికంగా చనిపోయి ఉంటుంది. నాలాగా.. అయినా తప్పంతా నాదే దానికి నీతులు చెప్పకూడదు. మీకు ఎదురు చెప్పకూడదు. 
అనసూయ: నువ్వు సిటీకి వెళ్లి రెండు రోజుల్లో వచ్చేయాలి. వట్టి చేతులతో రాకూడదు. వస్తే నీ మొగుడితో లేదంటే డబ్బుతో రావాలి. ఈ ఇళ్లు మాత్రం పోతే నేను ఊరుకోను.


మరోవైపు కార్తీక్ దీప ఇంటికి వస్తాడు. అక్కడ దీప ఇంటికి తాళం వేసి ఉంటుంది. పక్కనుంచి వస్తున్న పిల్లకు దీప గురించి అడిగిన కార్తీక్ దీప ఊరు వెళ్లిందని తెలుసుకుంటాడు. ఎక్కడికి వెళ్లావు దీప అని అనుకుంటాడు. ఇంతలో కార్తీక్‌కు తన తండ్రి కాల్ చేసి రెండు రోజులు అయింది అని అయినా కనిపించడం లేదని అడుగుతాడు. బయల్దేరుతున్నాను అని కార్తీక్ అంటాడు. కార్తీక్ ఏదో బాధగా ఉన్నావని తండ్రి కనిపెడతాడు. కార్తీక్ ఇంటికి బయల్దేరు తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: త్రినయని' సీరియల్: దెయ్యమై వచ్చి సుమనకు చుక్కలు చూపించిన పెద్దబొట్టమ్మ - నిజం తెలుసుకున్న నయని!