Prema Entha Madhuram Serial Today Episode: ఆర్య చేసిన సాయం వల్లే ఇవాళ తాను ఈ పొజిషన్‌లో ఉన్నానని.. సూరి, మేనేజర్ ను పిలిచి ఆర్య ఏం తీసుకున్నా బిల్లు వేయ్యెద్దని.. చెప్పగానే వాళ్లు షాపింగ్ చేశారని కార్డ్స్ పనిచేయలేదని వెళ్తున్నారు అని మేనేజర్ చెప్పడంతో సూరి.. సార్ తీసుకున్నవన్నీ ఇచ్చేయమని మేనేజర్‌కు చెప్తాడు. ఇదంతా గమనిస్తున్న అజయ్, మీరా షాక్ అవుతారు. ఆర్య ఫ్యామిలీని లోపలికి తీసుకెళ్లిన సూరి తన భార్యతో అను శారీస్ మొత్తం ఇప్పిస్తాడు. ఇద్దరూ కలిసి ఆర్య, అనుల ఆశీర్వాదం తీసుకుంటారు. అది చూసి మీరా, అజయ్ లు షాక్ అవుతారు.
నీరజ్: సూరి గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా దగ్గర పనిచేసే చాలా మంది మా ఉప్పు తిన్న కృతజ్ఞత కూడా లేకుండా మాకే చెడు చేయాలని చూస్తున్నారు. కానీ మీరు గతంలో చేసిన చిన్న సహాయాన్ని గుర్తుంచుకుని ఇంత కృతజ్ఞత చూపిస్తున్నారు. థాంక్యూ సో మచ్ అండి.
సూరి: గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు సార్. పైగా మీలాంటి మంచివాళ్లకు అన్యాయం చేయాలని చూస్తే.. వాళ్లే అన్యాయం అయిపోతారు సార్.
అను: మీ మంచితనం మీకు ఎప్పుడూ రక్షగా ఉంటుంది. మీ భార్య అవటం నిజంగా నా అదృష్టం సార్.
తర్వాత అకి, అభయ్ లు బాగ్స్ తీసుకుని ఇంటికి వస్తారు. శారదాదేవి ఎదురువచ్చి అను మీ షాపింగ్ బాగా జరిగిందా? అని అడుగుతుంది. షాపులో జరిగిన విషయం మాన్షి చెప్పబోతుంటే అను వద్దని వారిస్తుంది. దీంతో శారదాదేవి అను మీ గది మారిన విషయం పిల్లలకు తెలియదు కదా వెళ్లి పిల్లలకు చెప్పమ్మా అనగానే అను పైకి వెళ్తుంది. పిల్లలు రూంలోకి వెళ్తుంటే..
ఆనంది: ఆగండి ఇది మా రూము ఇందులో మీకు అలో లేదు.
అకి: ఇది మా రూము ఇందులో మా ఫోటోస్ కూడా ఉంటాయి. కావాలంటే వెళ్లి చూసుకోపో..
ఆనంది: మీ ఫోటోస్ ఎప్పుడో తీయించేశా.. ఇప్పుడు ఈ రూంలో మా ఫ్యామిలీ ఫోటోసే ఉన్నాయి. అలాగే నీ స్టడీ టేబుల్, నీవి కొన్ని బొమ్మలు నేనే తీసుకున్నా..
అను: అకి, అభయ్ మనం రూం చేంజ్ అయ్యామ్ అభయ్. నేనది చెప్తాను మీరు రండి.
అకి: చేంజ్ అవ్వడం ఏంటమ్మా.. ఇది మన రూము ఇందులో మనమే ఉండాలి.
మీరా: ఉండకూడదు. చూడండి పిల్లలు ఈ ఇంటికి మేయిన్ పర్సన్ లైక్ ఓనర్స్ వాళ్లు మాత్రమే ఈ గదిలో ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటికి ఆనంది వాళ్ల నాన్నే మెయిన్ కాబట్టి మేము మాత్రమే ఈగదిలో ఉండాలి.
అనగానే పిల్లలు నో మేము ఒప్పుకోము అంటుంటే శారదాదేవి వచ్చి మీరా పిల్లలతో ఇలాగేనా మాట్లాడేది అంటుంది. అను పిల్లలను తీసుకుని వెళ్లు అనగానే వెళ్లిపోతారు. తర్వాత శారదాదేవి మీరాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత కేశవ ఆర్యను జరుగుతున్నవన్నీ నువ్వు పట్టించుకోకపోతే ఎలా అంటాడు. అంత తెలిసి నువ్వు ఇలా మాట్లాడటమేంటి? అంటూ ఇద్దరూ కలిసి శారదాదేవి దగ్గరకు వెళ్తారు. అజయ్‌ని ఇంటికి తీసుకొచ్చిన ఉద్ద్యేశం ఒకటైతే ఇక్కడ జరుగుతున్నది మరోకటి అని బాధపడుతుంది. దీంతో ఆర్య నువ్వేమి ఆలోచించకుండా హ్యాపీగా ఉండు అని చెప్తాడు. తర్వాత శారదాదేవి హోమం జరిపిస్తున్న విషయం మాన్షి, మీరాకు ఫోన్ చేసి చెప్తుంది. పూజ టైంకి అజయ్‌ని తీసుకొచ్చి పూజ చెడగొట్టిస్తాను అని మీరా చెప్తుంది. మరోవైపు ఆర్య, అను, పిల్లలు పూజ కోసం రెడీ అవుతుంటారు. ఇంతల శారదాదేవి వచ్చి అనుకు నగలు ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఎన్టీఆర్ నుంచి నిఖిల్ సిద్దార్థ వరకు - పాలిటిక్స్‌లో మన టాలీవుడ్ స్టార్స్, హిట్ కొట్టింది కొందరే!