ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఘటనల ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) తెరకెక్కించిన సినిమా 'యాత్ర 2'. ఈ గురువారం (ఫిబ్రవరి 8న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ప్రేక్షకుల కంటే కొన్ని గంటల ముందు వైసీపీ ఎమ్మెల్యేలకు స్పెషల్ షో వేస్తున్నారు. 


విజయవాడలో 'యాత్ర 2' షో షురూ
విజయవాడలోని కళా నగర్ ఏరియాలో కల ట్రెండ్ సెట్ మాల్ (Trendset mall Vijayawada)లోని కాపిటల్ సినిమాస్ స్క్రీన్లలో 'యాత్ర 2' స్పెషల్ షోలు స్టార్ట్ అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు సినిమాకు హాజరు అయ్యారు. తమ పార్టీ అధినేత సినిమా కావడంతో ఆసక్తి చూపిస్తున్నారు.


ప్రజా ప్రతినిధులు రివ్యూలు చెబితే?
సాధారణంగా ప్రతి సినిమాకు క్రిటిక్స్ నుంచి ఫస్ట్ రివ్యూ రావడం కామన్. బట్, ఫర్ ఏ ఛేంజ్ 'యాత్ర 2' సినిమాకు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేగా ఎన్నికై చట్ట సభల్లో అడుగు పెట్టిన ప్రజా ప్రతినిధుల నుంచి ఫస్ట్ రివ్యూ (Yatra 2 First Review) వస్తుంది అన్నమాట! స్పెషల్ షోలు చూసిన వారి నుంచి పాజిటివ్ రివ్యూలు తప్ప ఒక్క నెగిటివ్ రివ్యూ ఆశించడం అత్యాశే అవుతుంది.


తండ్రికి ఇచ్చిన మాట కోసం పోరాడిన కొడుకు
Yatra 2 Movie Story: దర్శకుడు మహి వి రాఘవ్ తాను చెప్పాలని అనుకున్న కథ గురించి విడుదలకు ముందు స్పష్టంగా చెప్పారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో 2009 నుంచి 2019 మధ్య జరిగిన అంశాల ఆధారంగా 'యాత్ర 2' తీశానని వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏం జరిగింది? అనేది తెరపై చూపించానని మహి వి రాఘవ్ చెప్పారు. కొన్ని కల్పిత సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కొడుకు ఎటువంటి పోరాటం చేశాడనేది కథ అని వివరించారు.


Also Read'కెజియఫ్' రూటులో పుష్పరాజ్ - ఐకాన్ స్టార్ తగ్గేది లే






షర్మిల, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్రలు లేవు!
'యాత్ర 2' సినిమాలో జగన్ సోదరి, రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్రలు లేవని విడుదలకు ముందు చెప్పారు. కన్న తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు ఎటువంటి యుద్ధం చేశాడనేది కోర్ పాయింట్ కావడంతో జగన్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారట. కోడి కత్తి ఎపిసోడ్ కూడా లేదని దర్శకుడు స్పష్టం చేశారు.


Also Readషాక్ ఇచ్చిన విశాల్ - రాజకీయాలపై కీలక ప్రకటన


'యాత్ర 2'లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పాత్రలు ఎలా ఉంటాయోనని రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పొలిటికల్ బేస్డ్ సినిమా కావడంతో క్యాష్ చేసుకోవడానికి ఎన్నికల సీజన్ ముందు విడుదల చేస్తున్నామని మహి వి రాఘవ్ తెలిపారు.