‘మజిలీ’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి పలు హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మెప్పించాడు సుహాస్. అంతే కాదు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘హిట్-2’లో కూడా కీలక పాత్రలో కనిపించాడు. ఈ నేపథ్యంలో సుహాన్ హీరోగా నటించిన మరో చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. పోస్టర్లు, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ విడుదలై ఫీల్ గుడ్ సినిమాగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’ పై అందరూ ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. 


ఈ రోజు (08.02.2023) తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 38 థియేటర్లలలో మహిళలకు ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సుహాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సందేశాత్మక చిత్రంగా రూపొందిన ‘రైటర్ పద్మభూషణ్’ సినీ ప్రియుల మనుసును గెలుచుకోవడమే కాకుండా మహేష్ బాబు ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమా చూసిన ప్రిన్స్ చిత్రాన్ని పొగడకుండా ఉండలేపోయారు. ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను అని మహేష్ చెప్పడం గమనార్హం. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని ఆయన తెలిపారు. సినిమాలో నటీనటులు సైతం బాగా నటించారని ప్రశంసించారు. దీంతో సుహాస్ మహేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యాడు.


‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలో సుహాస్, టీనా శిల్పరాజ్, దర్శకుడు షణ్ముఖ్ ప్రశాంత్, యాంకర్ సుమ ప్రధాన పాత్రల్లో నటించారు. మహిళలకు ఈ మూవీ ఒక తీపి జ్జాపకంగా మిగిలిపోతుందని చిత్ర చిత్ర బృందం ప్రకటించింది. ఎంపిక చేసిన 38 థియేటర్లలో మాత్రమే మహిళలు ఈ సినిమా చూసేందుకు వెళ్లాలని కోరింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది చిత్ర యూనిట్. మహిళలతో పాటు పురుషులు వస్తే.. వారు కచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాలి. అయితే, మహిళలు టికెట్ తీసుకోవలసిన అవరసం లేదని తెలిపింది.  థియేటర్లలో మహిళలకు ఫ్రీ పాస్‌లను జారీ చేస్తారని, వాటిని ఎంట్రీ వద్ద చూపించి వెళ్లాలని కోరింది. అయితే ఆన్ లైన్‌లో ఈ పాస్‌లు అందుబాటులో ఉండవని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. కానీ థియేటర్ కౌంటర్లు, బుక్ మై షో, పేటీఎం వంటి ఆన్ లైన్ పోర్టల్ లలో సాధారణ టికెట్ విక్రయాలు యాథావిధిగా జరుగుతాయని తెలిపింది. మరొక విషయం ఏంటంటే.. కేటాయించిన 38 థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. 






ఇప్పటికే ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో సుహాస్‌కు క్రేజ్ మరింత పెరగనుంది. ‘కలర్ ఫోటో’ సినిమాతో ఎమోషనల్ పండించిన ఈ హీరో ఈ సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలో నెలదొక్కుకుంటూ చిన్న సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు సుహాస్. మరి ఈ సినిమా ఆయన జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పనుందో చూడాలి. 


Also Read: స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?