అందాల భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela)కు, క్రికెట్ (Cricket)కు మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉంది. టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్, ఆమెకు మధ్య ఏం జరిగిందో ప్రజలకు తెలియదు. కానీ, వాళ్ళిద్దరూ మాత్రం చాలా రోజులు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి క్రికెట్ సంబంధిత సమాచారంతో ఊర్వశి రౌతేలా మన ముందుకు వచ్చారు.


ఈఫిల్ టవర్ ముందు...
వరల్డ్ కప్ 2023 ట్రోఫీతో!
ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో ఈ రోజు ఫోటో పోస్ట్ చేశారు. చూశారా? ఈఫిల్ టవర్ ముందు వరల్డ్ కప్ ట్రోఫీతో ఫోటో దిగారు. అంతే కాదు.... ''ఫ్రాన్స్ దేశంలో, పారిస్ సిటీలో ఈఫిల్ టవర్ ముందు క్రికెట్ వరల్డ్ కప్ 2023 ట్రోఫీ లాంచ్ చేసిన ఫస్ట్ యాక్టర్'' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇంతకు ముందు కొందరు తారలు వరల్డ్ కప్ ట్రోఫీలను లాంచ్ చేశారు. అయితే... ఈఫిల్ టవర్ ముందు 2023 వరల్డ్ కప్ ట్రోఫీని లాంచ్ చేసిన అందాల భామగా ఊర్వశి రౌతేలా రికార్డులకు ఎక్కారు.


Also Read : పవన్ కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న ఊర్వశి రౌతేల - కానీ...






'స్కంద'తో స్పెషల్ సాంగ్...
వినాయక చవితికి సందడి!
సినిమాలకు వస్తే... ప్రత్యేక గీతాలతో ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'స్కంద - ది ఎటాకర్' సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 


సెప్టెంబర్ 15న 'స్కంద' థియేటర్లలో విడుదల కానుంది. సెప్టెంబర్ 18న వినాయక చవితి. ఆ పండగ సందర్భంగా సినిమా విడుదల కానుంది. పండక్కి ప్రత్యేక గీతంతో ఊర్వశి రౌతేలా సందడి చేయనున్నారు అన్నమాట! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో' సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి హిట్ 'వాల్తేరు వీరయ్య' సినిమాలో కూడా ఆమె సాంగ్ చేశారు.


Also Read : అవును, పవన్ కళ్యాణ్ సినిమాలో - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్



రిషబ్ శెట్టి 'కాంతార 2'లో ఊర్వశి రౌతేలా!
ఓవైపు ప్రత్యేక గీతాలు చేస్తూ... మరోవైపు కథానాయికగా కూడా సినిమాలు చేస్తూ ఊర్వశి రౌతేలా బిజీ బిజీగా ఉన్నారు. కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార' గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. అదే 'కాంతార 2'. అందులో ఊర్వశి రౌతేలా నటిస్తున్నారు. ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశం అని చెప్పాలి. సెన్సేషనల్ హిట్ 'కాంతార' ప్రీక్వెల్ అంటే  సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టి పడుతుంది. రిషబ్ శెట్టితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా 'కాంతార 2 లోడింగ్' అని కాప్షన్ ఇచ్చారు. దాంతో సినిమాలో ఆమె ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial