Urvashi Rautela - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న ఊర్వశి రౌతేల - కానీ?

పవన్ కళ్యాణ్ గురించి ఊర్వశి రౌతేలా ఓ నిజం తెలుసుకున్నారు. కానీ, చేసిన తప్పు ఇంకా సరిచేసుకోలేదని చెప్పాలి. అసలు, ఏమైంది? ఆమె ఏం చేశారు? అనేది చూస్తే... 

Continues below advertisement

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు (Who Is AP CM)? వైఎస్ జగన్మోహన్ రెడ్డి! అయితే... ఉత్తరాది భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మాత్రం జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనుకున్నారు. అక్కడితో ఆగలేదు. ట్వీట్ కూడా చేశారు. సోషల్ మీడియాలో ఆమె ట్వీట్ వైరల్ అయ్యేసరికి అసలు నిజం తెలుసుకున్నారు. అయితే... పొరపాటుగా చేసిన తప్పును ఇంకా దిద్దుకోలేదు. సరిచేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... 

Continues below advertisement

సీఎం పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం... 
పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో' ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'మై డియర్ మార్కండేయ...' పాటలో సందడి చేశారు. మామా అల్లుళ్ళతో కలిసి స్టెప్పులు వేశారు. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ఆమె ఓ ట్వీట్ చేశారు. 

''ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న విడుదలవుతోన్న 'బ్రో' సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అహంకారపూరితంగా నడుచుకునే ఓ యువకుడికి మరణించిన తర్వాత అవకాశం వస్తే... తన తప్పుల్ని ఎలా సరి చేసుకున్నాడు? అనేది సినిమా కథ. థియేటర్లలో కలుద్దాం'' అని ఊర్వశి రౌతేలా ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ అనడం ఏమిటి? ఆమెకు మినిమమ్ నాలెడ్జ్ లేనట్టుంది, ఆ విషయం కూడా తెలియలేదా? అని సెటైర్లు పడ్డాయి. 

ఊర్వశి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ''పాప ట్వీట్ ఇలాగే ఉంచు 2024 తర్వాత మాట్లాడుకుందాం'' అని ఒకరు కామెంట్ చేయగా... మరొకరు ''ఊర్వశికి అసలు విషయం తెలియదా?'' కామెంట్ చేశారు. ఒక రోజు తర్వాత ఊర్వశికి అసలు విషయం తెలిసింది. దాంతో ఈ రోజు కొత్తగా మరో ట్వీట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ నిన్న చేసిన ట్వీట్ టైపులో ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ముందు సీయం అనేది లేదు. 

ఊర్వశి రౌతేలా కొత్త ట్వీట్ అయితే చేశారు కానీ చిన్న చేసిన ట్వీట్ ఇంకా డిలీట్ చేయలేదు. పైగా, ఈ రోజు చేసిన ట్వీట్ లో రేపు జూలై 28న రిలీజ్ అని పేర్కొన్నారు. ఈ తప్పుల మీద కూడా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Also Read : శ్యాంబాబు ఎవరు 'బ్రో' - ఏపీ మంత్రి డ్యాన్స్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్?

అభిమానులు సీయం సీయం అని అరిస్తే... 
'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, అంతకు ముందు ప్రముఖ నిర్మాత ఏయం రత్నం, హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతున్న సమయాల్లోనూ అభిమానులు 'సీయం సీయం' అని అరిచారు. ఆ అరుపులు విని నిజంగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నట్లు ఉన్నారు ఊర్వశి రౌతేలా. ఆమె ట్వీట్స్ తెలుగు సినిమా అభిమానులు, రాజకీయ వర్గాల్లో చర్చకు కారణం అవుతున్నాయి. 

Also Read : నన్ను వదిలేయండి, ప్రభాస్ మీద కామెంట్ చేయలేదు - 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement