'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులపై ఆయన పరోక్షంగా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే... ఇప్పుడు తెలుగు హీరో, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మీద వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాన్ని ఆయన ఖండించారు. అసలు, ఏం ప్రచారం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే... 


అప్పుడు 'రాధే శ్యామ్' vs 'కశ్మీర్ ఫైల్స్'...
ఇప్పుడు 'సలార్' వర్సెస్ 'ది వ్యాక్సిన్ వార్'?
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' మార్చి 11న థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. 'రాధే శ్యామ్'తో పాటు మార్చి 11న 'ది కశ్మీర్ ఫైల్స్' కూడా విడుదల అయ్యింది. మొదట ఆ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మౌత్ టాక్, పైగా వివాదాస్పద అంశంపై రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు మెల్లగా ఆసక్తి కనబరిచారు. దాంతో 'కశ్మీర్ ఫైల్స్' సంచలన విజయం సాధించింది. 


ప్రభాస్ (రాధే శ్యామ్)పై పోటీలో 'కశ్మీర్ ఫైల్స్'తో విజయం సాధించానని, ఇప్పుడు 'వ్యాక్సిన్ వార్'తో కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేస్తానని వివేక్ అగ్నిహోత్రి కామెంట్ చేసినట్లు కొందరు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అవి ఆయన దృష్టికి రావడంతో ఖండించారు. 
ప్రభాస్ మెగా మెగాస్టార్... నన్ను వదిలేయండి!''ఇటువంటి తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేస్తున్నారు? ప్రభాస్ అంటే నాకు గౌరవం. ఆయన మెగా మెగాస్టార్! మెగా మెగా బడ్జెట్ మూవీస్ చేస్తున్నారు. మేం స్టార్స్ లేని స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ చేస్తున్నాం. మా మధ్య పోలిక లేదు. దయచేసి నన్ను వదిలేయండి'' అని వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. 






నిజంగా 'సలార్'తో పోటీకి వస్తున్నారా?
ఫ్యాక్ట్ చెక్ చేస్తే... ప్రభాస్, వివేక్ అగ్నిహోత్రి సినిమాలు ఈసారి ఒకేసారి విడుదల కావడం లేదు. 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'సలార్' సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది వ్యాక్సిన్ వార్' అక్టోబర్ 24న విడుదలకు రెడీ అయ్యింది. 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమానూ నిర్మిస్తున్నారు. ఇండియాలో 11 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల, రెండు సినిమాల మధ్య పోటీ లేదని చెప్పవచ్చు.


Also Read : కోలీవుడ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోంది - పవన్ వ్యాఖ్యలను ఖండించిన నాజర్!


ప్రభాస్ మీద, 'ఆదిపురుష్' రిజల్ట్ మీద వివేక్ అగ్నిహోత్రి మరో కామెంట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. రాత్రి తాగేసి తెల్లవారుజామున వచ్చి చిత్రీకరణ చేస్తే దేవుడు అని ఎవరూ నమ్మరని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలు ఆయన దృష్టి వరకు వెళ్ళలేదేమో? వాటిపై రియాక్ట్ కాలేదు. 


Also Read రూ. 150 కోట్ల షేర్ గ్యారెంటీ 'బ్రో'... పవన్ కళ్యాణ్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ఎంతంటే?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial