పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 'బ్రో'. ఈ శుక్రవారం (జూలై 28) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎంత రావచ్చు? ఫుల్ రన్ అయ్యే సరికి ఎంత కలెక్ట్ చేయొచ్చు? అనేది అంచనా వేసే ముందు ఒక్కసారి పవన్ కళ్యాణ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ ఓపెనింగ్స్ అండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీద ఓ లుక్ వేయండి.


'బ్రో'కు మినిమమ్ 40 కోట్లు ఓపెనింగ్స్ గ్యారెంటీ!?
రాజకీయాల కోసం సినిమాలకు పవన్ కళ్యాణ్ మధ్యలో కొంత విరామం ఇచ్చారు. ఆ గ్యాప్ ఇవ్వడానికి ముందు ఆయన నటించిన 'అజ్ఞాతవాసి' థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కలయికలో హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకని, ఓపెనింగ్స్ అదిరిపోయాయి. 


'అజ్ఞాతవాసి' ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 60.50 కోట్ల షేర్ వచ్చింది. దానికి ముందు 'కాటమరాయుడు' రూ. 39.20 కోట్లు, 'సర్దార్ గబ్బర్ సింగ్'కు రూ. 40.80 కోట్ల షేర్ కలెక్ట్ చేశాయి. గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్'తో ఓపెనింగ్స్ విషయంలో పవర్ స్టార్ అదరగొట్టారు. ఆ సినిమాకు రూ. 53.50 కోట్లు వచ్చాయి. అయితే... 'భీమ్లా నాయక్'కు రూ. 37.30 కోట్లు మాత్రమే వచ్చాయి.


పవన్ కళ్యాణ్ లాస్ట్ ఐదు సినిమాల ఓపెనింగ్స్ చూస్తే... 'బ్రో' సినిమాకు మినిమమ్ 40 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్టామినాకు అది తక్కువ అని కొందరు అభిమానులు ఫీలవుతున్నారు.


'బ్రో' ఫైనల్ రన్ 150 కోట్లు పక్కా?
పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా 'భీమ్లా నాయక్' ఓపెనింగ్స్ / ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువ కావచ్చు... కానీ, ఫైనల్ రన్ కలెక్షన్స్ విషయంలో 'వకీల్ సాబ్' కంటే ఓ అడుగు ముందు ఉంది.


Also Read : అనుష్క సినిమా వాయిదా - ప్రభాస్ కజిన్‌కు తిట్లు తప్పవా?


'భీమ్లా నాయక్' సినిమా రూ. 156.8 కోట్లు కలెక్ట్ చేస్తే... 'వకీల్ సాబ్' రూ. 139.60 కోట్లు వసూలు చేసింది. 'అజ్ఞాతవాసి' ఓపెనింగ్స్ అదరగొట్టినా... ఫ్లాప్ టాక్ రావడంతో ఫైనల్ రన్ రూ. 94.60 కోట్లు దగ్గర ఆగింది. 'కాటమరాయుడు' రూ. 97.5 కోట్లు, 'సర్దార్ గబ్బర్ సింగ్' రూ. 85.50 కోట్లు కలెక్ట్ చేశాయి. 


ఆల్మోస్ట్ వంద కోట్లు టచ్ చేసిన 'బ్రో'
Bro Movie Pre Release Event : ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో 'బ్రో' సినిమా ఆల్మోస్ట్ వంద కోట్లు టచ్ చేసింది. సుమారు రూ. 98 కోట్లకు ఏపీ, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ అమ్మారు.


Also Read అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?


 


'బ్రో' సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఆయన తీసిన తమిళ హిట్ 'వినోదయ సీతం' ఆధారంగా రూపొందిన చిత్రమిది. అయితే... తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. తమన్ సంగీత దర్శకుడు. సాయి తేజ్ జోడీగా కేతికా శర్మ, కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. 'మై డియర్ మార్కండేయ' పాటలో ఊర్వశి రౌతేలా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial