సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) పేరు చెబితే మన తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది 'డీజే టిల్లు'. టిల్లు అంటే సిద్ధు, సిద్ధు అంటే టిల్లు. అంతలా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి టిల్లుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.   


డీజే టిల్లు సీక్వెల్... 'టిల్లు స్క్వేర్‌'!
సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా, 'డీజే టిల్లు'కు సీక్వెల్ (DJ Tillu Sequel)గా రూపొందుతున్న సినిమా 'టిల్లు స్క్వేర్' (Tillu Square Movie). ఇందులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయిక. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమాలో మొదటి పాటను విడుదల చేశారు. 


''టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా...
సిట్టి నీది సిరుగుతుందేమో సూడర బుల్లోడా...
మూసుకుని కూసోకుండా గాలం వేశావు పబ్బు కాడ...
సొర్రసేప తగులుకుంది తీరింది కదరా


మురిసిపోక ముందున్నాది... 
కొంప కొల్లేరు అయ్యేతేదీ!గాలికిపోయే గంప... 
నెత్తికొచ్చి సుట్టుకున్నాది!ఆలి లేదు సూలు లేదు... 
గాలే తప్ప మ్యాటర్ లేదు!


ఏది ఏమైనా గానీ టిల్లుగానికడ్డే లేదు 
టిల్లన్నా ఇల్లాగయితే ఎల్లాగన్నా?
స్టోరీ మళ్ళీ రిపీట్ యేనా?
పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా''    
అంటూ సాగిన ఈ జీతానికి రామ్ మిరియాల సంగీతం అందించారు. 'టిల్లు అన్న డీజే కొడితే...' పాటకు కూడా ఆయన సంగీతం అందించారు. పాడారు. ఇప్పుడీ పాటను కూడా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. 


Also Read అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?



'టిల్లు స్క్వేర్' ఫస్ట్ సాంగ్ వింటే... టిల్లు మళ్ళీ సేమ్ మిస్టేక్స్ చేస్తుంటే ఎవరో హెచ్చరించినట్లు ఉంది. కొత్త అమ్మాయితో ప్రేమలో పడిన టిల్లు, ఈసారి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. 'టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా...' సాంగ్ వింటుంటే? మరోసారి యువతకు నచ్చే, వాళ్ళు మెచ్చే పాట అందించారని చెప్పాలి. ఈ పాటలో సిద్ధూ జొన్నలగడ్డ వేసిన స్టెప్స్ కూడా బావున్నాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. 


Also Read తెలుగులోకి తమన్నా ట్రెండింగ్ సాంగ్ - మాస్ & స్పైసీ గురూ!



'డీజే టిల్లు' సినిమాతో, అందులో పాత్రతో యువ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధూ జొన్నలగడ్డ, స్టార్ బాయ్‌గా ఎదిగాడు. అసలు, టిల్లు పాత్రను సిద్ధు డిజైన్ చేసిన తీరుకు, ఆ డైలాగులకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అందుకే, సినిమా అంత బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. మరొక థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ 'టిల్లు స్క్వేర్'ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  


సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్, కూర్పు : 'జాతీయ పురస్కార గ్రహీత' నవీన్ నూలి, సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, కళ: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, దర్శకుడు : మల్లిక్ రామ్. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial