సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన సినిమా 'జైలర్' (Jailer Movie). ఆయన టైటిల్ రోల్ చేశారు. దీనికి నయనతార ప్రధాన పాత్రలో 'కో కో కోకిల', శివ కార్తికేయన్ హీరోగా 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'బీస్ట్' చిత్రాలు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. రజనీకి 169వ సినిమా. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. అందులో ఓ పాట విపరీతంగా వైరల్ అయ్యింది. అందుకు కారణం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇప్పుడు ఆ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చింది. 


తెలుగులోకి తమన్నా ట్రెండింగ్ సాంగ్
'వా నువ్ కావాలయ్యా' పాట (Kaavaalaa Song)ను రెండు వారాల కృతం విడుదల చేశారు. శిల్పా రావుతో కలిసి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఆ పాటను ఆలపించారు. సోషల్ మీడియాలో చాలా మంది తమన్నా వేసిన స్టెప్స్ వేసి రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చింది. 


తమిళంలో శిల్పా రావు పాడగా... తెలుగులో సింధూజ శ్రీనివాసన్ పాడారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ అందించారు. తమిళంలో అరుణ్ రాజ్ కామరాజ్ రాశారు. 


'రా దాచుంచారా పరువాలన్నీ
రాబరికి రావే రావే
రా అందిస్తారా అందాలన్నీ
ఎప్పటికీ నీవే నీవే'అంటూ సాగిన పాటను ఓసారి చూడండి.   


Also Read పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు, గెలిపించాలి - బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు



Jujubee Song: 'జుజుబీ' పేరుతో 'జైలర్'లో మరో పాటను రూపొందించారు. ఆ సాంగ్ తమిళ్ వెర్షన్ కూడా ఈ రోజు విడుదలైంది. దాంతో పాటు 'హుకుం' తెలుగు వెర్షన్ కూడా త్వరలో విడుదల చేయనున్నారు. 


Also Read అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?



ఆగస్టు 10న థియేటర్లలోకి 'జైలర్'
Jailer Movie Release Date : ఆగస్టు 10న 'జైలర్' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే... కేరళ వరకు టైటిల్ కొంచెం మారింది. 


కేరళలో దర్శకుడు షకీర్ మదాత్తిల్ 'జైలర్' ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రజని సినిమా టైటిల్ ముందు అనౌన్స్ చేసినప్పటికీ... కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన ముందుగా రిజిస్టర్ చేయించుకున్నారు. అందుకని, మలయాళం వరకు 'ది జైలర్' పేరుతో విడుదల చేయనున్నారు. అదీ సంగతి! 


రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'జైలర్'లో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌ కుమార్, సునీల్, రమ్య కృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు , రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు ఇతర తారాగణం.  కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్, కూర్పు : ఆర్. నిర్మల్, కళ : డాక్టర్ కిరణ్, యాక్షన్: స్టన్ శివ.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial