Pooja Hegde : తనపై తప్పుడు పోస్టులు చేశాడని ఆరోపిస్తూ ప్రముఖ నటి పూజా హెగ్డే తాజాగా క్రిటిక్ ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు పంపింది. ఈ నోటీసులను చూపిస్తూ తాజాగా ఉమైర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు తనకు పూజా నోటీసులు పంపిందంటూ నవ్వుతూ తన వెటకారాన్ని ప్రదర్శించాడు. దీనికి తోడు ఫ్లాప్ యాక్ట్రెస్ అనే బిరుదునూ ప్రకటించాడు. ఇంతకీ అతను పూజాపై చేసిన కామెంట్స్ ఏంటీ..? ఎందుకు ఆమె అంతలా ఫైర్ అయింది..?
నేషనల్ మీడియాకే కాకుండా లోకల్ మీడియాకు బాగా పాపులర్ అయిన క్రిటిక్ ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయి సెన్సార్ బోర్డ్ మెంబర్ ని అంటూ సినిమా రిలీజ్ కు ముందే రివ్యూలు చెప్పే అతనికి ఇక్కడ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. అదే రేంజ్ లో శత్రువులు కూడా ఉన్నారు. అందుకు కారణం రివ్యూలు ఇవ్వటమేనని అందరికీ తెలుసు. రివ్యూల పేరుతో ఎవరో ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ పై నోటికొచ్చి వాగుతూ వార్తల్లో నిలవడం అతనికి సర్వసాధారణమే. అంతే కాదు అన్నీ కళ్లతో చూసినట్లు అందరికీ ఎఫైర్స్ అంటగడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తూంటాడు. ఎప్పుడూ ఎవరో ఒకర సెలబ్రిటీలను టార్గెట్ చేయడం.. వారి గురించి వారి పర్సనల్ విషయాల గురించి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటుంటాడు.
ఈ క్రమంలోనే ఇటీవల స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపైనా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్నాడు ఉమైర్ సంధు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఉమైర్ సంధు రీసెంట్ గా ట్వీట్ చేశారు. పూజా గత రెండు వారాలుగా తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని.. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఉమైర్ సంధు తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాదు ఈ సమయంలోనే కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఆమెను కాపాడాకలిగారని కూడా ఉమైర్ చెప్పడం అందర్నీ షాక్ కు గురి చేసింది. దీంతో ఉమైర్ చేసిన ట్వీట్ పై పూజా హెగ్డే అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీకు వేరే పనిలేదా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నావా అని అతన్ని విమర్శించారు. మరికొందరు పూజా మధ్యాహ్నం తన ఫోటోల్ని కూడా షేర్ చేసిందని ఆధారాలు కూడా చూపెట్టారు.
ఇదిలా ఉండగా ఉమైర్ సంధు కాంట్రవర్శియల్ ట్వీట్ పై స్పందించిన పూజా హెగ్డే టీమ్.. తాజాగా అతనికి లీగల్ నోటీసులు పంపింది. అయితే వాటిని కూడా అతను గర్వంగా తన ట్విట్టర్ లో పెట్టుకుని మురిసి పోతున్నాడు. అంటే తనను ఎవరూ ఏమీ చేయగలరు అన్నట్లు సోషల్ మీడియా పోస్ట్ చేసి మరీ తన ధోరణిని నిరూపించుకుంటున్నాడు. వేరే దేశంలో ఉండి ఇలా ట్వీట్స్ చేస్తూ.. లీగల్ గా దొరకనని చెప్తున్నట్లుగా ఉంది అతని వైఖరి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అంతకు ముందు హీరో అక్కినేని అఖిల్, ఊర్వశి రౌతేలా ను హెరాస్ చేశాడని ఆమెను ఇబ్బంది పెట్టాడంటూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసాడు ఉమైర్. ఏజెంట్ సినిమా ఐటెం సాంగ్ షూట్ సమయంలో అఖిల్.. ఊర్వశిని ఏడిపించాడని, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఊర్వశి కూడా అతనితో వర్క్ చేయడం నచ్చలేదని, అతను ఇబ్బంది పెట్టాడని చెప్పినట్లు ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్తా అప్పట్లో వైరల్ గా మారింది. ఆమె కూడా ఆ ట్వీట్ పై స్పందించి లీగల్ నోటీస్ పంపినట్టు సమాచారం.
Read Also : Tamannaah: తమన్నా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద ఖరీదైన డైమండ్ - అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial