పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'బ్రో'(BRO). సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్గా నిర్వహించారు. జూలై 25 మంగళవారం రోజున హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ లు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో పవర్ స్టార్ స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సాయిధరమ్ తేజ్ ఈరోజు ఇక్కడ ఉన్నాడంటే దానికి ఆరోజు ప్రమాదం జరిగిన సమయంలో కాపాడిన అబ్దుల్ కారణమని, అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ’’ ఎమోషనల్ అయ్యారు.


"ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాని ఓకే చేసే టైమ్ లోనే సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయ్యింది. నేను, త్రివిక్రమ్ గారు కలిసి ఉన్న సమయంలో ఫోన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ కి వెళ్లాను. చిన్న యాక్సిడెంటే కదా.. ఇంకో గంటలో బయటికి వచ్చేస్తాడు అనుకున్నాను. కానీ బయటికి రావడం లేదు. ఆ సమయంలో నాకు తెలియని ఓ నిస్సహాయత వచ్చేసింది. నాకు చాలా భయమేసింది. ఆ సమయంలో ఓ మూలన కూర్చుని మనసులో ఏడ్చాను. వాడికి ఇంకా జీవితం ఉంది. వాడిని కాపాడు అంటూ నేను నిత్యం పూజించే దేవత జగన్మాతను కోరుకున్నాను’’ అని తెలిపారు. తేజ్‌ను కాపాడిన డాక్టర్స్ కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలిపారు.


అపోలో హాస్పిటల్ డాక్టర్స్ తో పాటూ తేజ్ కి ఇనీషియల్ ట్రీట్మెంట్ ఇచ్చిన మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ కావచ్చు ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక తేజ్ యాక్సిడెంట్ జరిగి రోడ్డుపై అలా పడిపోయి ఉంటే అతన్ని సకాలంలో అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ లో చేర్పించి సహాయం చేసిన అబ్దుల్ కి ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. సాయం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఏ సమయంలో వస్తుందో ఎవరికీ తెలియదు. సాయం చేయడానికి కులం, మతం, ప్రాంతం లాంటి భేదాలు అవసరం లేదు. వాటన్నిటికీ అతీతంగా ఉండి మానవత్వంతోనే సాయం చేయాలి. ఆ మానవత్వమే ఈరోజు మనల్ని నడిపిస్తుంది. అలాంటి మానవత్వంతో తేజ్ కి సాయం చేసిన అబ్దుల్ ని నేనెప్పటికీ మర్చిపోను. నా గుండెల్లో పెట్టుకుంటాను" అని అన్నారు.


"ఇక తేజు కాస్త కుదుటపడిన తర్వాత ఈ సినిమా చేస్తున్న సమయంలో సరిగ్గా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాడు. అలాంటి సమయంలో దర్శకుడు సముద్ర ఖని గారు తేజు కి వెన్నంటే ఉండి తనని జాగ్రత్తగా చూసుకుని తన చేత డైలాగ్స్ చెప్పించారు" అని తెలిపారు పవన్ కళ్యాణ్ దీంతో ప్రస్తుతం సాయి తేజ యాక్సిడెంట్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. అవుతుంది. కాగా 'బ్రో' సినిమాని తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వినోదయ సీతం' అనే చిత్రానికి రీమేగా రూపొందించారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఈ రీమేక్ కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించారు.


Also Read : ఆ రోజు మా వదిన చేసిన ద్రోహం మాటల్లో వర్ణించలేనిది: పవన్ కళ్యాణ్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial