Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. దముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా గురించి తన సినిమా కెరీర్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


సినిమాల మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు: పవన్ కళ్యాణ్


తాము చాలా మధ్య తరగతి కుటుంబాల నుంచే వచ్చామని అయితే అన్నయ్య చిరంజీవి స్టార్ గా ఎదిగిన తర్వాత తనను కూడా హీరోగా చేస్తావా అని ఇంట్లో అడిగారన్నారు. కానీ తన వద్ద అప్పుడు సమాధానం లేదని అన్నారు. తనకి సినిమాల మీద ధ్యాస ఉండేది కాదని, ఎక్కడైనా ఓ చిన్న ఉద్యోగం చేస్తూ దూరంగా పొలంలో పని చేసుకుంటూ  లైఫ్ ను సింపుల్ గా గడిపేస్తానని చెప్పానని, అప్పుడే సినిమాలకు నో చెప్పానని అన్నారు. అయితే తాను హీరో అవుతానని నమ్మి మనస్పూర్తిగా ప్రోత్సాహించిన వ్యక్తి తన వదిన సురేఖ అని చెప్పారు. 


మా వదిన చేసిన ద్రోహం మాటల్లో వర్ణించలేను..


తాను హీరోగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తనలో ఆ భయం పోలేదని అన్నారు. అందరి ముందు నటించాలంటే, మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడినని అన్నారు పవన్ కళ్యాణ్. ఓ రోజు తాను చేస్తున్న సినిమాలో ఓ పాట కోసం వైజాగ్ జగదంబా సెంటర్ లో షూటింగ్ చేస్తున్నామని, అప్పుడు తనను బస్ ఎక్కి దానిపై డాన్స్ చేయాలని చెప్పారని, ఆ రోజు తాను అలా అందరి ముందు డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని, ఏడుపొచ్చేసేదని అన్నారు. ఆ రోజే వదిన సురేఖకు ఫోన్ చేసి ‘‘నువ్వు నన్ను ఎందుకు సినిమాల్లోకి ప్రోత్సాహించావు, అలా వదిలేసి ఉంటే ఎక్కడోచోట చిన్నగా బతికేసేవాడ్ని కదా’’ అని అడిగానని అన్నారు. ఆ రోజు మా వదిన చేసిన తప్పు ఇవాళ మీముందు నన్ను నిలబెట్టింది. మా వదిన చేసిన ద్రోహం మాటల్లో వర్ణించలేనిది అంటూ చెప్పుకొచ్చారు పవన్. 


అలాగే ప్రతీ ఒక్కరూ సాధించాలి..


అందరి ముందు మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యే తాను వదిన సురేఖ ప్రోత్సాహం వల్ల హీరో అయ్యాయని అన్నారు. తన లాంటి వాడే సాధించినపుడు ప్రతీ ఒక్కరూ సాధించగలరని అన్నారు. అయితే తాను హీరోగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత అన్నయ్య పేరును ఎక్కడా వాడుకోలేదని, తన అన్నయ్య కష్టపడిన దానికంటే ఎక్కువ కష్టపడాలని అనుకునేవాడినని అలాగే సినిమాల్లో కష్టపడ్డానని అన్నారు. ఇప్పుడు రాబోయే తరం హీరోలు కూడా అలాగే గ్రాటిట్యూడ్ తీసుకోకుండా ఎవరికి వారు కష్టపడాలని, కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించగలమని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 


Also Read: సమంత సర్కస్ ఫీట్లు - ఇదేం పార్టీ సామ్? ఈ వైరల్ వీడియో చూశారా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial