జంక్ ఫుడ్ చూస్తే పెద్ద వాళ్ళే నోరు కట్టేసుకుని ఉండలేరు ఇక పిల్లలు ఆగుతారా? ఈ ఆధునిక యుగంలో పిల్లలు జంక్ ఫుడ్ కి వ్యసనపరులుగా మారిపోయి చిన్నవయసులోనే ఊబకాయులుగా మారిపోతున్నారు. అందుకే చిన్న వయసు నుంచి వారి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ద అవసరం. జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది. పోషకమైన ఎంపికలు, మెరుగైన ఆహారపు అలవాట్లు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాల గురించి వివరించి చెప్పాలి.


జంక్ ఫుడ్ ప్రతికూలతలు చెప్పాలి


పిల్లల్లో ఈ అలవాటుని మార్చడం కోసం వాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు. జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలు వివరించాలి. ఇలాంటివి తింటే లావు అవుతారని, అలసట, నీరసంగా అయిపోతారని చెప్పాలి. కడుపు గడబిడ చేయడం వల్ల ఏ పని సరిగా చేయలేరని చెప్పాలి. ఈ విధంగా వాళ్ళకి వివారిస్తే సీరియస్ గా తీసుకుంటారు.


స్మార్ట్ ఎంపికలు


ఆరోగ్యకరమైన ఎంపికలతో అనారోగ్య ఆహారాలని భర్తీ చేయాలి. శీతల పానీయం తాగాలని పట్టుబడితే శీకాంజీ ఇవ్వండి. అదే ఐస్ క్రీమ్ అడిగితే స్వీట్ లస్సీ లేదా ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీమ్ అందించండి. ఏదో ఒక విధంగా మంచి మాటలు చెప్పి షేక్స్, స్మూతీస్ ఇవ్వాలి. వీటిని తినడం వల్ల ఆరోగ్యమే కాదు కడుపు నిండుతుంది.


వంటగది పనుల్లో సాయం చేయమనండి


చిన్నతనం నుంచి అలవర్చుకోవాల్సిన ఆరోగ్యకరమైన అలవాటు ఇది. వంట గదిలో చిన్న చిన్న పనుల్ని మీ పిల్లలతో చేయించండి. ఉదయం అల్పాహారం కోసం శాండ్ విచ్ తయారు చేయాలని ప్లాన్ చేస్తే అందుకోసం పిల్లలకు వెన్న, పండ్లు, కూరగాయలు బ్రెడ్ లో వేయాలి. ఇది పిల్లలకు నచ్చుతుంది. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు చక్కగా వివరించాలి. ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి పెడతారు.


పిల్లలు తినేందుకు ఏరోజు ఏ అల్పాహారం తినాలో మెనూ సిద్ధం చేయాలి. ఆరోగ్యకరమైన ఎంపికలు చేస్తే మంచిది. చెప్పినట్టుగా తింటే రివార్డ్ ఇస్తామని, బయటకి తీసుకెళ్తామని ఆఫర్ చేయాలి. ఇది వారికి మంచి ఉత్సాహం కలిగిస్తుంది. తినాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరు చెప్పినట్టు తినడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మాన్ సూన్ సీజన్లో వారికి నచ్చిన ఆరోగ్యకరమైన ఆహారం పెడితే రోగనిరోధక శక్తి బలపడుతుంది. సీజనల్ వ్యాధులని ఎదుర్కోగలిగే సామర్థ్యం వస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Join Us on Telegram:https://t.me/abpdesamofficial


Also Read: ఈ కిచెన్ రెమిడీస్ తో డార్క్ సర్కిల్స్ సింపుల్ గా తొలగించుకోవచ్చు