మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన మాస్ & స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. రేపు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
రేపే 'భోళా శంకర్' ట్రైలర్ రిలీజ్!
Ram Charan to launch Bholaa Shankar trailer : 'భోళా శంకర్' ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేస్తారని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం చిరంజీవి అమెరికాలో ఉన్నారు. అందువల్ల, ఆయన తనయుడితో ట్రైలర్ రిలీజ్ చేయిస్తున్నారు. మరి, సోషల్ మీడియా ద్వారా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ట్రైలర్ విడుదల చేస్తారా? లేదంటే స్పెషల్ ప్రోగ్రాం ఏదైనా ప్లాన్ చేశారా? అనేది చూడాలి. గురువారం సాయంత్రం 4.05 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అనిల్ సుంకర (Anil Sunkara)కు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'భోళా శంకర్' సినిమాను నిర్మించింది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఇందులో చిరంజీవి సరసన తమన్నా భాటియా నటించారు. చిరు సోదరిగా కీర్తీ సురేష్, ఆమె ప్రియుడిగా ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కనిపించనున్నారు.
'మిల్కీ బ్యూటీ'కి రెస్పాన్స్ బావుంది
మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ 'భోళా శంకర్' సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 'భోళా మేనియా' పేరుతో మొదటి పాట విడుదల చేశారు. ఆ తర్వాత 'జామ్ జామ్ జజ్జనక' పాట విడుదల చేశారు. ఈ సినిమాలో మూడో పాట 'నా మిల్కీ బ్యూటీ, నువ్వే నా స్వీటీ'ని ఇటీవల విడుదల చేశారు. ఆ పాటకు రెస్పాన్స్ అదిరింది.
Also Read : పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు, గెలిపించాలి - బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు
'మిల్కీ బ్యూటీ'కి సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. విజయ్ ప్రకాష్, మహతి స్వర సాగర్, సంజన ఆలపించారు. ఫారిన్ లో అందమైన లొకేషన్లలో పాటను తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది.
చిరుతో పాటు కీర్తీ, తమన్నా, సుశాంత్ డ్యాన్స్!
Jam Jam Jajjanaka Song : కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన 'జామ్ జామ్ జజ్జనక' లిరికల్ వీడియో చూస్తే... చిరుతో పాటు ఈ పాటలో కీర్తీ సురేష్, సుశాంత్, తమన్నాతో స్టెప్పులు వేశారు. సంతోషం, సంబరం నిండిన సమయాల్లో అందరూ పాడుకునే పాటలా రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది.
Also Read : అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?
రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్ & దిలీప్ సుబ్బరాయన్ & కాచే కంపాక్డీ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కిషోర్ గరికిపాటి, ఛాయాగ్రహణం : డడ్లీ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial