తమిళ చిత్రసీమ తమిళులకే అంటే ఎలా? మీరూ 'ఆర్ఆర్ఆర్' తీయాలి - పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి 


''మన పరిశ్రమ (సినిమాల్లో) లో, మనవాళ్ళు మాత్రమే చేయాలనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని తమిళ చిత్ర పరిశ్రమకు, అందులోని పెద్దలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజ్ఞప్తి చేశారు. 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ వేడుక (Bro Movie Pre Release Event)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ విధంగా మాట్లాడటం వెనుక ఓ కారణం ఉంది. అసలు వివరాల్లోకి వెళితే... తమిళ సినిమా చిత్రీకరణలు తమిళనాడులో మాత్రమే చేయాలని, తమిళ చిత్రాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ తమిళులు అయ్యి ఉండాలని ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ఇటీవల కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. ఒకవేళ ఆ నిబంధనలు అతిక్రమించినట్లు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో పవన్ విజ్ఞప్తి చేశారు (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).


షారుక్ ఖాన్ కోసం ‘కెప్టెన్ అమెరికా’ స్టంట్ మాస్టర్ - హాలీవుడ్ రేంజ్‌లో ‘జవాన్’ స్టంట్స్


బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'జవాన్'. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత షారుక్ ఖాన్ నటించిన సినిమా కావడంతో అటు అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా 'జవాన్' రివ్యూ పేరుతో రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను తారస్థాయికి చేర్చింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక మూవీ టీం సినిమాపై ఎప్పటికప్పుడు వరుస అప్డేట్స్ ఇస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).


వరుణ్ తేజ్‌తో జతకట్టనున్న నోరా ఫతేహి, మరి మీనాక్షి చౌదరి సంగతేంటి?


Nora Fatehi: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ సినిమా ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా జులై 27 న హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ల గురించి చర్చ నడుస్తోంది. నిన్నటి వరకూ ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకో పేరు వచ్చి చేరింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఈ మూవీలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి). 


పూజా హెగ్డేపై తప్పుడు కూతలు - అతడికి లీగల్ నోటీసులు పంపిన బుట్టబొమ్మ!


తనపై తప్పుడు పోస్టులు చేశాడని ఆరోపిస్తూ ప్రముఖ నటి పూజా హెగ్డే తాజాగా క్రిటిక్ ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు పంపింది. ఈ నోటీసులను చూపిస్తూ తాజాగా ఉమైర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు తనకు పూజా నోటీసులు పంపిందంటూ నవ్వుతూ తన వెటకారాన్ని ప్రదర్శించాడు. దీనికి తోడు ఫ్లాప్ యాక్ట్రెస్ అనే బిరుదునూ ప్రకటించాడు. ఇంతకీ అతను పూజాపై చేసిన కామెంట్స్ ఏంటీ..? ఎందుకు ఆమె అంతలా ఫైర్ అయింది? (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి)


రాత్రి తాగి, పొద్దున్నే దేవుడిని అంటే ప్రజలు నమ్మరు - ప్రభాస్‌పై ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు కామెంట్స్


'కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా ప్రభాస్ 'ఆదిపురుష్' ఫెయిల్యూర్ పై స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న ఆయన 'ఆదిపురుష్' సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది? అనే ప్రశ్నకు స్పందిస్తూ 'ఆదిపురుష్' మేకర్స్ తో పాటు యాక్టర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial