Who is Natarajan Subramaniam, the Maharaja actor also known for camera expertise: విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' సినిమా.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంట్లో విజయ్ సేతుపతి నటన చాలా చాలా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమాలో ఆయన తర్వాత అందరినీ బాగా ఆకట్టుకున్నది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన నటరాజన్ సుబ్రమణ్యమ్. సినిమాలో ఆయన క్యారెక్టర్ కీలకం అనే చెప్పాలి. అయితే, ఇప్పుడు ఆయనకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ విషయం బయటికి వచ్చింది. నిజానికి నటరాజన్ యాక్టర్ కాదట. మరి ఏంటి ఆయన ప్రొఫెషన్ ఒకసారి చూద్దాం.
యాక్టర్ కాదట..
'మహారాజ' సినిమాలో విజయ్ సేతుపతి తర్వాత ప్రతి ఒక్కరిని తన నటనతో ఆకట్టుకున్నారు నటరాజన్. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకం కూడా. అయితే, ఆ నటరాజన్ సినిమాటోగ్రఫర్ అట. ఆయన చాలా హిందీ, తమిళ్, తెలుగు సినిమాలకు కూడా సినిమాటోగ్రఫర్ గా చేశారు. తెలుగులో త్రివిక్రమ్ తో కలిసి పనిచేశారు నటరాజన్. 'రంజన్న', 'జబ్ వీ మెట్', త్రివిక్రమ్ 'అఆ', 'ఛల్ మోహన్ రంగ' సినిమాలకు ఆయన డీఓపీగా పనిచేశారు. ఇక ఆయన నటించిన 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెలుగులో కూడా రీమెక్ చేశారు. 2014లో వచ్చిన 'శతురంగ వెట్రాయ్' అనే సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
పెళ్లిల్లకి ఫొటోగ్రఫర్ గా చేస్తూ..
తమిళనాడుకు చెందిన నటరాజన్ సినిమాల్లోకి రాకముందు పెళ్లిల్లకు, ఫంక్షన్లకు ఫొటోగ్రఫీ చేసేవాడు. ఫొటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ తో 18 ఏళ్లకే చదువు మానేసి ప్రొఫషన్ లోకి వచ్చారు. ఇక ఆ తర్వాత కొన్నిరోజులకి సినిమాటోగ్రఫీ వైపు వచ్చిన ఆయన బీ.ఆర్. విజయ్ లక్ష్మీ కింద అసిస్టెంట్ గా చేరాడు. అయితే, అక్కడ సరైన గుర్తింపు రావడంతో సొంతంగా డాక్యుమెంట్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ తదితరులు సిఫార్సుతో సినిమాల్లోకి వచ్చారు.
అనురాగ్ కశ్యప్ తో షార్ట్ ఫిలిమ్..
నటరాజన్ ని అందరూ నట్టి అని పిలుస్తారు. నిజానికి ఆయన అసిస్టెంట్ డీఓపీగా సినిమా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ తగిన గుర్తింపు లభించలేదు. కానీ, ఆతర్వాత అనురాగ్ కశ్యప్ తో కలిసి ఆయన చేసిన షార్ట్ ఫిలిమ్ తన కెరీర్ ని మలుపు తిప్పింది. 1999లో 'లాస్ట్ ట్రైన్ టూ మహాకాళి' షార్ట్ ఫిలిమ్‌తో మంచి గుర్తింపు వచ్చింది నటరాజన్‌కు. ఆ తర్వాత తలపతి విజయ్ తదితరులతో కలిసి పనిచేశారు. అనుకోకుండా యాక్టింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ యాక్టర్, డీఓపీగా దూసుకుపోతున్నారు.
'మహారాజ' సినిమాలో నటరాజన్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు.. మమతా మోహన్ దాస్, అభిరామ్ గోపీ కుమార్, అరుల్డోస్, మునిష్ కాంత్, భారతీరాజా తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకి నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. జులై 14న రిలీజైంది ఈ సినిమా. కాగా.. ఇది విజయ్ సేతుపతి 50వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. లక్ష్మీ అనే చెత్త బుట్ట పోయిందని, దాన్ని వెతికిపెట్టాలంటూ విజయ్ సేతుపతి పోలీసులను ఆశ్రయించడంతో సినిమా మొదలవుతుంది. ఇక సినిమా క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉండటంతో హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read: 'రాజాసాబ్'కి రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్?