‘భలే మంచిరోజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పంజాబీ బ్యూటీ వామికా గబ్బి. ఈ అందాల సుందరి ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అవుతోంది.  ఓటీటీ దర్శకనిర్మాతలు సైతం ఆమె పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.  ఇటు ఓటీటీలో, అటు వెండితెరపై సత్తా చాటుతోంది.   


‘జబ్‌ వియ్ మెట్‌’ తో ఆరంగేట్రం


షాహిద్ కపూర్ , కరీనా కపూర్ జంటగా నటించిన ‘జబ్‌ వియ్ మెట్‌’ చిత్రంతో వెండితెరపైకి అడుగు పెట్టింది. అప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ‘సిక్స్‌ టీన్‌’ మూవీతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పంజాబీలోనూ పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఓటీటీలో కూడా సత్తా చాటుతోంది వామికా. డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌లో  ప్రసారమైన ‘గ్రహణ్‌’ ఆమె తొలి వెబ్‌ సిరీస్‌. 1984లో సిక్కులపై జరిగిన మారణహోమం నేపథ్యంలో దీన్ని నిర్మించారు.  ఆ తర్వాత  ‘జూబ్లీ’ వెబ్‌సిరీస్‌లోనూ కనిపించి మెప్పించింది.  


తొలి మహిళా డిటెక్టివ్ గా వామికా


ఇక ప్రస్తుతం ‘చార్లీ చోప్రా మరియు ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇండియన్ ఓటీటీలో తొలి మహిళా డిటెక్టివ్ గా కనిపించబోతోంది.  మర్డర్ మిస్టరీ కథాశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. దర్శకుడు విశ్వాల్ భరద్వాజ్ ఈ సిరీస్ ను రూపొందించారు. అగాథా క్రిస్టీ నవల ‘ది సిట్టాఫోర్డ్ మిస్టరీ’ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన పాత్ర పోషించడం పట్ల వామికా సంతోషం వ్యక్తం చేసింది. ఒక అమాయక దోషిని రక్షించడానికి తాను చేసే ప్రయత్నాన్ని ఈ సిరీస్ లో చూపించబోతున్నట్లు ఆమె వెల్లడించింది. “భారతదేశపు మొట్టమొదటి మహిళా డిటెక్టివ్ పాత్రను పోషించడం సంతోషంగా ఉంది. ఇందులో నేను నటించిన చార్లీ చోప్రా పాత్ర నాకు ఎంతో బాగా నచ్చింది. దర్శకుడు విశాల్ నా పాత్రను అద్భుతంగా చిత్రీకరించారు. ప్రేక్షకులు నా పాత్రను ఎలా స్వీకరిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని వామికా వెల్లడించింది.    


సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్


నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, గుల్షన్ గ్రోవర్, నీనా గుప్తా, లారా దత్తా, ప్రియాంషు పైన్యులి, చందన్ రాయ్ సన్యాల్, ఇమాదుదిన్ షా, వివాన్ షా, పాయోలీ డ్యామ్ తో పాటు పలువురు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ‘చార్లీ చోప్రా అండ్ ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ’ వెబ్ సిరీస్  సెప్టెంబర్ 27న సోనీ LIVలో స్ట్రీమింగ్ కానుంది.   వామికా త్వరలో ‘ఖుఫియా’లో కనిపించనుంది. ఇందులో టబు, అలీ ఫజల్‌లతో కలిసి కనిపించనుంది. అటు వరుణ్ ధావన్ తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది.  






Read Also: ‘పాన్ ఇండియా’ పదాన్ని వాడకండి, ‘జవాన్ 2’లో నా క్యారెక్టర్ చూసి ఆశ్చర్యపోయా - ప్రియమణి


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial