ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కి అద్భుత విజయాలను అందుకుంటున్నాయి. ‘పుష్ప’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ సాధించాయి. తాజాగా ‘కాంతార’ కూడా ఇదే లిస్టులో చేరింది. సౌత్ దర్శకులు, నటీనటలు ప్రతిభను చాలా మంది మూవీ మేకర్స్ మెచ్చుకుంటున్నారు. అద్భుత పనితీరు కనబర్చారంటూ ప్రశంసిస్తున్నారు. కానీ, కొంత మంది మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘కాంతార’ లాంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయని పేర్కొన్నాడు. 


పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కు ముప్పు-అనురాగ్


‘సైరత్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా మరాఠీ ఇండస్ట్రీని కొలాప్స్ చేసిందని దర్శకుడు నాగరాజు మంజులే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ను అనురాగ్ కశ్యప్ కోట్ చేస్తూ.. ‘కాంతార’ విషయాన్ని ప్రస్తావించారు. ‘కాంతార’ లాంటి  సినిమాల కారణంగా ఇండస్ట్రీ నాశనం అవుతుందన్నారు. ఇలాంటి సినిమాలు విజయం సాధించడం వల్ల బాలీవుడ్  కుదేలవుతోందన్నాడు. పాన్ ఇండియా సినిమాలతోనే బాలీవుడ్ కు అసలు ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు. పాన్ ఇండియా సినిమాలతో దర్శక నిర్మాతలు కొత్త ట్రెండ్ ను కొనసాగిస్తున్నారని చెప్పాడు. దీని వల్లే బాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్నాడు. కొన్ని సినిమాలు దేశ వ్యాప్తంగా సక్సెస్ అయినా, వాటిని కాపీ చేసి పాన్ ఇండియా సినిమాలు తీస్తే బాలీవుడ్ కు దెబ్బ తప్పదన్నాడు. ఇండస్ట్రీ బాగుపడాలంటే కథల్లో కొత్తదనం ఉండకతప్పదన్నాడు.





అనురాగ్ వ్యాఖ్యలు తప్పుబట్టిన వివేక్ అగ్నిహోత్రి


అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలను ‘కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తప్పుబట్టారు. అనురాగ్ ను 'బాలీవుడ్ మిలార్డ్'గా సంబోధిస్తూ ఆయన వ్యాఖ్యలతో తాను ఏమాత్రం ఏకీభవించనని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “బాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మిలార్డ్ అభిప్రాయాలతో నేను పూర్తిగా పూర్తిగా ఏకీభవించను. మీరు అంగీకరిస్తారా?” అంటూ కామెంట్ చేశారు.






అనురాగ్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు


పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కు ప్రమాదమన్న అనురాగ్ వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. గొప్ప సినిమాలు చేయడం చేతగాక, చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు.














Read Also: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మరో షాక్, పరువు నష్టం కేసు పెట్టిన నోరా ఫతేహి