మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రెండు రోజుల క్రితమే కేరళ నుంచి హైదరాబాద్ వచ్చారు. తాను కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' (ఇంకా అనౌన్స్ చేయలేదు అనుకోండి) మూడో షెడ్యూల్ పూర్తి చేశారు. రెండు రోజుల రెస్ట్ తరువాత వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' స్పెషల్ సాంగ్ (Vishwambhara Special Song) షూటింగ్ స్టార్ట్ చేశారు.

Continues below advertisement


హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ బ్యూటీ!
Mouni Roy Telugu Debut: 'విశ్వంభర' సినిమాతో బెంగాలీ భామ, బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన తొలి అడుగు వేస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ అయినా హిందీ సినిమాల ద్వారా ఆవిడ ప్రేక్షకులకు పరిచయం అయితే ఇప్పటి వరకూ ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేరు. ఇప్పుడు చిరుతో  స్టెప్పులు వేసే ఛాన్స్ అందుకున్నారు.



హైదరాబాద్ సిటీలో ఉన్నట్లు మౌని రాయ్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో తన టీంతో కలిసి దిగిన ఫోటో కూడా షేర్ చేశారు. చిరు సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం ఆవిడ వచ్చినట్లు తెలిసింది. ఒక ప్రైవేట్ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మూడు నాలుగు రోజుల పాటు ఈ పాటను తెరకెక్కించనున్నారు.


Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!


'విశ్వంభర' సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అయితే యువ సంగీత దర్శకుడు భీమ్స్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. 'అన్నయ్య' సినిమాలో 'ఆట కావాలా పాట కావాలా' తరహాలో ఈ సాంగ్ ఉంటుందట. ఈ పాటకు కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ అందిస్తున్నారు.


చిరంజీవి సరసన సౌత్ క్వీన్ త్రిష, కన్నడ భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్. ఇందులో సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువి క్రియేషన్స్ పతాకం మీద విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న చిత్రమిది.


Also Readదమ్ముంటే తిరిగి కొట్టండి... నెగిటివ్ రివ్యూలు, బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై అభిమానులకు పవన్ కళ్యాణ్