'హరి హర వీరమల్లు'ను బాయ్ కాట్ చేయమని విడుదలకు ముందు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ట్రెండ్ చేశాయి. విడుదలైన తొలి ఆట నుంచి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మీద విమర్శలు వస్తున్నాయి.‌ సినిమాపై నెగిటివిటీ పవన్ కళ్యాణ్ దృష్టి వరకు వెళ్ళింది.‌ వీరమల్లు విడుదల రోజు (గురువారం) నిర్వహించిన సక్సెస్ మీట్‌లో వాటి గురించి ఆయన స్పందించారు. 

నాకు ధైర్యంగా ఉండడమే తెలుసు!ఇవాళ తాను ఎంత ఎదిగాననేది తనకు తెలియదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఈ రోజు ఇంత బలంగా ఉన్నానంటే కారణం తన అభిమానులే అని ఆయన అన్నారు. అభిమానులు ఇచ్చిన బలం వల్లే ఇలా ఉన్నానని తెలిపారు. తనకు ధైర్యంగా ఉండడమే తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. తనకు‌ డిప్రెషన్ ఉండదని చెప్పారు. 

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ''నాకు డిప్రెషన్ అనేది ఉండదు. ఎందుకు అంటే... సక్సెస్ కంటే బ్రతకడం అనేది చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది. ఇంట్లో నా కొడుకు డిప్రెషన్ అంటే ఒక రోజు అన్నం తినడం మానేయమని చెబుతా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే... మన సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారని అంటున్నారు. మన మీద నెగిటివిటీతో మాట్లాడుతున్నారంటే మనం బలంగా ఉన్నామని అర్థం'' అని చెప్పారు. తన సినిమాను బాయ్ కాట్ చేస్తామని అంటున్నారని చెబితే చేసుకోమని చెప్పానని ఆయన వివరించారు. 

అభిమానులూ... సున్నితంగా ఉండొద్దు!వీరమల్లు సినిమాలో గ్రాఫిక్స్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటి గురించి పవన్ మాట్లాడారు. తనకు వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని రెండో పార్టులో కరెక్ట్ చేస్తామని చెప్పారు. టెక్నికల్ పరంగా మెరుగుపరుచుకునేందుకు ఎప్పుడు ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు.

Also Readఏపీలో 'కింగ్‌డమ్‌' టికెట్ రేట్స్ పెరిగాయ్... ఎంతంటే? సేఫ్ గేమ్ ఆడిన విజయ్ దేవరకొండ?

నెగిటివ్ ట్రోల్స్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ''పార్ట్ 2లో విజువల్స్ పరంగా మిస్టేక్స్ కలెక్ట్ చేస్తాం ముఖ్యంగా నా అభిమానులకు ఈ విషయం గురించి ఎందుకు చెబుతున్నానంటే మీరు అంత సున్నితంగా ఉండకంయ్యా! తేలికగా ఉండండి దెబ్బలు తింటున్నది నేను కదా మీరు ఎంజాయ్ చేయండి. ప్రతి సోషల్ మీడియా కామెంట్ చూసి నలిగిపోకండి. నీకు దమ్ముంటే తిరిగి కొట్టండి. ఎలా దాడి చేయాలో అలా చేయండి. నెగిటివ్ అంశాలను కొట్టి నలమేయండి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గురించి లేదంటే నిర్మాత ఏం రత్నం గురించి లేదంటే దర్శకుడు జ్యోతి కృష్ణ లేదంటే మరొకరి గురించి కాదు. ఇది భారతీయత గురించి చెప్పిన సినిమా. మన సివిలైజేషన్ గురించి చెప్పిన సినిమా. చరిత్ర పుస్తకాలలో వాళ్ల గురించి గొప్పగా చెప్పారు.‌ కానీ, గొప్పవాళ్లేం కాదు. చెత్త పనులు కూడా చేశారు. కోహినూర్ కంటే దేశానికి వేద శాస్త్రాలు, జ్ఞానాన్ని అందించిన గురువుల గురించి చెప్పిన సినిమా ఇది. కోహినూర్ ఉంటుంది పోతుంది కానీ మనిషి తాలూకా జ్ఞానం పోతే ఒక సివిలైజేషన్ అంతం అవుతుంది'' అని అన్నారు.

Also Readయుద్ధభూమికి వీరమల్లు... క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్... అది ఏమిటో తెలుసా?