Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

Vishnu Vs Manoj : మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు బయట పడ్డాయి.

Continues below advertisement

గొడవ పడిన విష్ణు..

Continues below advertisement

మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారన్న గుసగుసలూ వినిపించాయి. ఇప్పుడీ అనుమానాలకు తెరపడింది. మంచు మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవ పడ్డారు. అతనిపై దాడి చేసేందుకూ ప్రయత్నించినట్టు సమాచారం. చాలా కాలంగా మంచు కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న సారథి...మనోజ్‌ దగ్గర పనిచేయడంపై విష్ణు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇంటికెళ్లి మరీ గొడవ పడ్డారని ప్రచారం జరుగుతోంది. మూడేళ్లుగా మంచు మనోజ్‌కు విష్ణు బర్త్‌డే విషెస్ కూడా చెప్పలేదు. ఇటీవల మనోజ్ పెళ్లిలోనూ విష్ణు పెద్దగా జోక్యం చేసుకున్నట్టు కనిపించలేదు. అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇప్పుడు విష్ణు..సారథి ఇంటికి రావడంతో వీళ్ల మధ్య విభేదాలు నిజమే అని ఓ క్లారిటీ వచ్చింది. విష్ణు ఇలా పదేపదే ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడంటూ మనోజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. మంచు విష్ణు గొడవ పడ్డ వీడియోని పోస్ట్ చేశాడు. అయితే..ఈ వివాదంపై మోహన్‌ బాబు సీరియస్ అయిన్టటు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఏంటీ గొడవ అని మందలించినట్టు సమాచారం. అప్పటికే మనోజ్ ఫేస్‌బుక్ పోస్ట్‌ను డిలీట్ చేశారు. 



Continues below advertisement