పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh). వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారట.
ఏప్రిల్ 5 నుంచి ఉస్తాద్ షురూ!
ఏప్రిల్ 5న 'ఉస్తాద్ భగత్ సింగ్' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. పవన్ కళ్యాణ్ పది రోజులు సినిమాకు డేట్స్ కేటాయించారట. ఏప్రిల్ 15 వరకు ఈ సినిమా షూటింగ్ చేసి... ఆ తర్వాత కొన్ని రోజులు 'వినోదయ సీతం' రీమేక్ ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే ఫినిష్ చేయాలని ప్లాన్ చేశారట. మేలో సుజీత్ 'ఓజీ' షూట్ కూడా స్టార్ట్ కానుందని సమాచారం.
స్క్రిప్ట్ ఫుల్లుగా మార్చేసిన హరీష్ శంకర్!
తమిళ హిట్ 'తెరి'కి రీమేక్ ఈ సినిమా. పవన్ కళ్యాణ్ ఇమేజ్, తెలుగు నేటివిటీ దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ కథలో చాలా మార్పులు చేశారట. 'గబ్బర్ సింగ్' చూస్తే... ఇది సల్మాన్ ఖాన్ 'దబాంగ్' రీమేకేనా? అని డౌట్ వస్తుంది. ఆ స్థాయిలో మార్పులు చేసిన అనుభవం హరీష్ శంకర్ సొంతం. ఈ సినిమాకు కూడా అలా చేశారట.
హీరోయిన్లు ఎవరు?
'తెరి'లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. మరి, పవన్ కళ్యాణ్ సరసన ఎవరు నటిస్తారు? ఇప్పుడీ ప్రశ్న ఎక్కువ మందిలో ఉంది. అందుకు కారణం మాళవికా మోహనన్. ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఆమెకు అవకాశం లభించిందని ప్రచారం జరిగింది. అయితే, దానిని ఆమె ఖండించింది. పవన్ అంటే గౌరవం అని, నటించాలని ఉందని చెబుతూ... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో తాను భాగమైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలియజేసింది. ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉన్నట్లు వినికిడి.
Also Read : ఏయ్ పిల్లా - రవితేజ వారసుడి సినిమా ఆగింది!
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. సినిమాకు డిసెంబర్ లో పూజ చేశారు. త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'ఉస్తాద్ భగత్ సింగ్'లో వీజే సన్నీ!
హరీష్ శంకర్ కథ అందించడంతో పాటు ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన వెబ్ సిరీస్ 'ఏటీఎమ్'. అందులో వీజే సన్నీ (VJ Sunny) హీరోగా నటించారు. ఏకంగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాతో నటించే ఛాన్స్ అందుకున్నారు. 'ఏటీఎమ్'కు లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపిన వీజే సన్నీ... దర్శకుడు చంద్రమోహన్, నటుడు రవిరాజ్‌తో కలిసి ABP Desamకు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పవన్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు.
''పవన్ కళ్యాణ్ గారితో మీరు చేయబోయే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సెట్స్‌కు ఒక్కసారి వస్తానని, మీతో ఫోటో దిగుతానని హరీష్ శంకర్ గారికి ఓసారి అడగాలని అనుకున్నాను. అయితే, ఓ రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో నేను కూడా నటిస్తున్నానని చెప్పారు. నాకు అది సర్‌ప్రైజ్. ఐయామ్ సో హ్యాపీ'' అని ఏబీపీ దేశం ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సన్నీ చెప్పారు.
Also Read : : హిందూపూర్ వెళ్ళడానికి ముందు - అమ్మాయి నిష్కతో తారక రత్న, చివరి వీడియో ఇదేనా?